Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pro Kabaddi: మ‌ళ్లీ గెలుపు బాట ప‌ట్టిన బెంగ‌ళూరు బుల్స్‌.. మ‌రో మ్యాచ్‌లో గుజ‌రాత్ గెలుపు

Bengaluru bulls Beat UP Yoddha And Gujarat Giants Beat Bengal Warriors

బెంగ‌ళూరు: ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో మ‌రో రెండు ఆస‌క్తికర మ్యాచ్‌లు ముగిశాయి. ఒక మ్యాచ్‌లో బెంగాల్ వారియ‌ర్స్‌పై గుజ‌రాత్ జెయింట్స్ విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్‌లో యూపీ యోధాపై బెంగ‌ళూరు బుల్స్ గెలుపొందింది. తద్వారా వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాలు త‌ర్వాత బెంగ‌ళూరు బుల్స్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది. అంతేకాకుండా ఈ విజ‌యంతో పాయింట్ల టేబుల్‌లో కూడా రెండో స్థానానికి ఎగ‌బాకింది.

గుజ‌రాత్ గెలుపు

బెంగాల్ వారియ‌ర్స్‌పై గుజ‌రాత్ జెయింట్స్ 34-25 తేడాతో గెలిచింది. త‌ద్వారా టోర్నీలో ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గుజరాత్ జ‌ట్టులో అజ‌య్ కుమార్ 9, ప్ర‌దీప్ కుమార్ 7 పాయింట్ల‌తో రాణించారు. హ‌డి, రాకేష్ నాలుగేసి పాయింట్లు సాధించారు. ప‌ర్వేష్ బైస్వాల్ 3, సునీల్ కుమార్ 2, రాకేష్ న‌ర్వాల్ ఒక పాయింట్ సాధించారు.

ఇక బెంగాల్ జ‌ట్టులో మ‌నీంద‌ర్ సింగ్ 9, రాన్ సింగ్ 6 పాయింట్ల‌తో రాణించారు. మిగ‌తా వారిలో ఎస్మాయిల్ నబీబక్ష్ 5, ర‌వీంద్ర ర‌మేష్ 4, అమిత్ ఒక పాయింట్ సాధించారు.

బెంగ‌ళూరు విజ‌యం

మ‌రో మ్యాచ్‌లో యూపీ యోధాపై బెంగ‌ళూరు బుల్స్ విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత బెంగ‌ళూరు బుల్స్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది. యూపీ యోధాపై 31-26 తేడాతో గెలుపొందింది. బెంగ‌ళూరు జ‌ట్టులో ప‌వ‌న్ కుమార్ 9, అమ‌న్ 7, భ‌ర‌త్ 6 పాయింట్ల‌తో రాణించారు.

మిగతా వారిలో నంద‌ల్ 3, అంకిత్ 2, మోహిత్, మోర్ త‌లో పాయింట్ సాధించారు. ఇక యూపీ యోధా జ‌ట్టులో నితీష్ కుమార్, శ్రీ‌కాంత్ జాద‌వ్ ఆరేసి పాయింట్లు సాధించారు. మిగ‌తావారిలో ప్ర‌దీప్ న‌ర్వాల్, సుమిత్ నాలుగేసి పాయింట్లు సాధించారు. అశు సింగ్ 3, సురేంద‌ర్ గిల్ 2, సాహిల్ ఒక పాయింట్ సాధించారు.

పాయింట్ల ప‌ట్టిక

పాయింట్ల ప‌ట్టిక‌లో ద‌బాంగ్ ఢిల్లీ అగ్ర స్థానంలో కొన‌సాగుతుంది. 9 విజ‌యాలు సాధించిన ఢిల్లీ ఖాతాలో 53 పాయింట్లు ఉన్నాయి. ఇక బెంగ‌ళూరు బుల్స్ కూడా 9 విజ‌యాలు సాధించిన‌ప్పటికీ 51 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. ఇక 8 విజ‌యాలు, 45 పాయింట్ల‌తో పాట్నా మూడో స్థానంలో ఉంది. 6 విజ‌యాలు, 43 పాయింట్ల‌తో హ‌ర్యాణా స్టీల‌ర్స్ నాలుగో స్థానంలో ఉంది.

5 విజ‌యాలు 42 పాయింట్ల‌తో యు ముంబా ఐదో స్థానంలో, 5 విజ‌యాలు 41 పాయింట్ల‌తో యూపీ యోధా స్థాన‌లో ఉన్నాయి. 7 విజ‌యాలు 41 పాయింట్ల‌తో బెంగాల్ వారియ‌ర్స్ ఏడో స్థానంలో, 6 విజ‌యాలు 40 పాయింట్ల‌తో జైపూర్ పింక్ పాంథ‌ర్స్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఒక్క విజ‌యం సాధించిన తెలుగు టైటాన్స్ 22 పాయింట్ల‌తో చిట్ట చివ‌ర‌న ఉంది.

Story first published: Wednesday, February 2, 2022, 7:53 [IST]
Other articles published on Feb 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+