హర్యాణా థ్రిల్లింగ్ విక్టరీ
గుజరాత్ జెయింట్స్, హర్యాణా స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఫస్టాప్‌లో హర్యాణా చెలరేగింది. ఫస్టాప్ ముగిసే సమయానికి 22-10 తేడాతో అధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్‌లో గుజరాత్ అద్భుతంగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో సెకాండాఫ్‌లో 10 నిముషాలు ముగిసే సమయానికి స్కోర్ అంతరాన్ని 25-28కి తగ్గించింది. అక్కడి నుంచి మ్యాచ్ హోరాహోరిగా సాగింది. 30-25 తేడాతో హర్యాణా అధిక్యాన్ని కొనసాగించింది. అయితే ఇంతలోనే గుజరాత్ పుంజుకోని స్కోర్‌ను 35-35 తో సమం చేసింది. అయితే చివరి నిముషంలో మూడు పాయింట్లు సాధించిన హర్యాణా ఈ ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై 38-36 తేడాతో విజయం సాధించింది. హర్యాణా జట్టులో వికాస్(11 పాయింట్లు), మహేందర్ (10 పాయింట్లు) సత్తా చాటారు. గుజరాత్ జట్టులో రాకేష్ 19 పాయింట్లతో చెలరేగిన ఫలితం లేకపోయింది.
బెంగళూరు ఘనవిజయం
పుణేరి పల్టాన్‌పై బెంగళూరు బుల్స్ ఘనవిజయం సాధించింది. 40-29 తేడాతో గెలిచింది. ఆ జట్టులోని పవన్ కుమార్ 11 పాయింట్లతో సూపర్10 సాధించాడు. చంద్రన్ 6, భరత్ 5 పాయింట్లు సాధించారు. ఇక పుణే జట్టులో అస్లామ్, మోహిత్ గోయత్ ఆరేసి పాయింట్లు సాధించారు. పవన్ కుమార్ 5, విశాల్ 4 పాయింట్లు సాధించారు. రైడింగ్‌లోనూ, ట్యాకిల్స్‌లోనూ బెంగళూరు చివరి వరకు అధిపత్యాన్ని కనబరిచి విజయం సొంతం చేసుకుంది.
పాయింట్ల పట్టిక వివరాలు
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు బుల్స్ మొదటి స్థానంలో ఉంది. 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన ఆ జట్టు ఖాతాలో 23 పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో దబాంగ్ ఢిల్లీ(21), మూడో స్థానంలో యు ముంబా(17), నాలుగో స్థానంలో పాట్నా పైరేట్స్(16) ఉన్నాయి. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని తెలుగు టైటాన్స్ పట్టికలో పదకొండో స్థానంలో ఉంది. జట్టు ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

నేటి మ్యాచ్‌లు
నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరో మ్యాచ్‌లో మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్, తెలుగు టైలాన్స్ తలపడనున్నాయి. రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


Click it and Unblock the Notifications












