For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొ కబడ్డీ: తొలి పరాజయానికి గురైన తెలుగు టైటాన్స్

Pro Kabaddi League 2018 : Telugu Titans Edged Out By Bengal Warriors | Oneindia Telugu
Bengal Warriors vs Telugu Titans, Pro Kabaddi 2018: Warriors beat Titans 30-25

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమిని చవిచూసింది. రెండు వరుస విజయాల తర్వాత జోన్‌ 'బి'లో భాగంగా మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ 25-30తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మనీందర్‌ సింగ్‌ 11 పాయింట్లతో వారియర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మణీందర్‌ సింగ్‌ 11 రైడ్‌ పాయింట్లతో

మణీందర్‌ సింగ్‌ 11 రైడ్‌ పాయింట్లతో

గెలిచేందుకు టైటాన్స్‌కు మంచి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరీ (2 పాయింట్లు) విఫలమవడంతో టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. విజేత జట్టు తరఫున మణీందర్‌ సింగ్‌ 11 రైడ్‌ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో శ్రీకాంత్‌ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. ప్రథమార్ధం అయ్యేసరికి ఆ జట్టే 13-10తో ఆధిక్యంలో నిలిచింది.

రాహుల్‌ చౌదరి చేసిన తప్పిదంతో

రాహుల్‌ చౌదరి చేసిన తప్పిదంతో

ఐతే 32వ నిమిషంలో బెంగాల్‌ పుంజుకుని స్కోరు సమం చేసింది. 17-17 వద్ద మనీందర్‌ డబుల్‌ రైడింగ్‌ పాయింట్లతో జట్టుకు ఆధిక్యాన్నందించాడు. అక్కడి నుంచి మ్యాచ్‌లో ఉత్కంఠత పెరిగింది. 39వ నిమిషంలో టైటాన్స్‌ 25-27తో వెనుకబడి ఉండగా.. కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి చేసిన తప్పిదంతో ప్రత్యర్థికి రెండు పాయింట్లు కోల్పోయి మ్యాచ్‌ను దూరం చేసుకుంది.

జైపుర్‌ 36-33తో హరియాణాపై విజయం

జైపుర్‌ 36-33తో హరియాణాపై విజయం

టైటాన్స్‌ తరఫున నీలేశ్‌ 5 రైడ్‌ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో అబోజర్‌ మిఘాని (5 పాయింట్లు) రాణించాడు. రాహుల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క రైడింగ్‌ పాయింట్‌ కూడా సాధించలేదు. రెండు ట్యాకిల్‌ పాయింట్లు మాత్రమే తెచ్చాడు. ఈ ఓటమి తర్వాత కూడా తెలుగు జట్టే జోన్‌-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో జైపుర్‌ పింక్‌పాంథర్స్‌ 36-33తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది.

బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో

బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో

నితిన్‌ నర్వాల్‌ 8 రైడ్‌ పాయింట్లతో జైపుర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే ఈ మ్యాచ్‌లో హీరో మాత్రం హరియాణా ఆటగాడు నవీనే. అతను ఏకంగా 15 రైడ్‌ పాయింట్లు సాధించడం విశేషం. కానీ అతడికి సహచరుల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తమిళ్‌ తలైవాస్, హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.

Story first published: Wednesday, October 17, 2018, 8:39 [IST]
Other articles published on Oct 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+