Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాట్రిక్‌: బంగ్లాదేశ్‌పై కొరియా సంచలన విజయం

అహ్మదాబాద్: ప్రపంచ కబడ్డీ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దక్షిణ కొరియా సంచలనాలను నమోదు చేస్తోంది. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్, భారత్‌ను తొలి మ్యాచ్‌లోనే ఓడించిన కొరియా మరో అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 35-32 తేడాతో విజయం సాధించింది. కొరియా స్టార్ రైడర్ జంగ్ కున్ లీ మెరుగ్గా ఆడటంతో ఓటమి అంచుల్లోంచి బయపడి అనూహ్య విజయం సాధించింది. దీంతో వరుసగా మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Kabaddi World Cup 2016

దీంతో గ్రూప్-ఎలో 11 పాయింట్లతో ఇప్పటిదాకా టాప్‌లోనున్న భారత్ రెండోస్థానానికి పడిపోయింది. చివరి ఐదు నిమిషాల వరకు బంగ్లాదేశ్ 29-23తో ఆధిక్యంలోనే ఉన్నప్పటికీ, 38వ నిమిషంలో కున్‌ సూపర్‌ రైడ్‌తో మూడు పాయింట్లు తెచ్చి మ్యాచ్‌‌ని విజయం దిశగా నడిపించాడు.

ఆ వెంటనే బంగ్లాదేశ్ స్కోరు సమం చేయడంతో పాటు ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన దక్షిణ కొరియా 34-30తో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో థాయ్‌లాండ్‌ 10 పాయింట్లతో గ్రూప్‌-బిలో మూడో స్థానంలో ఉంది. ఇక గ్రూప్-బిలో థాయ్‌లాండ్ 53-21 స్కోరు తేడాతో కెన్యాపై విజయం సాధించింది.

గత మూడు మ్యాచుల్లో థాయ్‌లాండ్‌ జట్టుకు ఇది రెండో విజయం. థాయ్‌లాండ్‌ కెప్టెన్‌ ఖోమ్సన్‌ తోంగ్‌ఖామ్‌ 14 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

కబడ్డీలో శుక్రవారం నాటి మ్యాచ్‌లు:
ఇంగ్లండ్ X అర్జెంటీనా రాత్రి 8 గంటలకు
అమెరికా X పోలండ్ రాత్రి 9గంటలకు

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+