Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పురుషుల హీరోచిత పోరు: కబడ్డీలో భారత్‌కు స్వర్ణం

Kabaddi asiad india

ఇంచియాన్: ఆసియా క్రీడల కబడ్డీ పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి స్వర్ణపతకం సాధించారు. ఇరాన్‌పై జరిగిన ఫైనల్ మ్యాచులో భారత ఆటగాళ్లు ఇరాన్‌పై 27-25 స్కోరుతో విజయం సాధించారు.

కబడ్డీలో భారత్‌కు రెండు స్వర్ణపతకాలు లభించాయి. అంతకు మహిళా విభాగంలో భారత్ స్వర్ణపతకం సాధించింది. భారత మహిళలు ఫైనల్‌లో ఇరాన్‌పైనే తలపడ్డారు. మహిళా కబడ్డీలో భారత్ ఇరాన్‌ను 31-21 స్కోరుతో ఓడించారు. 2010 కబడ్డీ పురుషుల విభాగంలో కూడా భారత్ పైనల్లో ఇరాన్‌ను ఓడించింది.

ఆసియా క్రీడల్లో భారత్‌కు కబడ్డీలో వరుసగా ఇది ఏడో స్వర్ణపతకం. ఆసియా క్రీడల్లో 1990లో కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచీ భారత్ విజయం సాధిస్తూ వచ్చింది. కెప్టెన్ రాకేష్ కుమార్ హ్యాట్రిక్ సాధించాడు. అతను 2006 (దోహా), 2010 (గౌంఝావో) ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత జట్టులో ఉన్నాడు.

మొదటి అర్థ భాగంలో భారత్ 13 - 21 స్కోరుతో వెనకబడినట్లు కనిపించింది. ఆ తర్వాత కేవలం 20 నిమిషాల్లో భారత్ 14 పాయింట్లు సాధించి ఇరాన్‌పై పైచేయి సాధించింది. ఇరాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించగలగింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+