For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేనలా అనలేదు, ఫిట్‌గా ఉన్నా: రిటైర్మెంట్ వార్తలపై కెప్టెన్

By Nageshwara Rao

అహ్మదాబాద్: వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి తాను వీడ్కోలు తీసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై ఇండియన్ కబడ్డీ జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ స్పందించారు. ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం మీడియాతో మాట్లాడారు. కబడ్డీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే తాను అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. ఏదో ఒకరోజు ఆట నుంచి తప్పుకోవాలని ఆదివారం తాను చెప్పానని, అంతేతప్ప తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని అన్నారు.

ప్రస్తుతం తాను ఫిట్‌‌గా ఉన్నానని, దేశం తరుపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. హర్యానాకు చెందిన అనూప్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్లు తెలిపాడు.

Anup Kumar quashes rumours of imminent retirement post Kabaddi World Cup

అయితే ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 'నేను ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌గా ఉండాలనుకుంటున్నా. ఈ మేరకు అంతర్జాతీయ కబడ్డీకి గుడ్‌బై చెబుతున్నా. ఈ వరల్డ్ కప్ అనంతరం జాతీయ జట్టు నుంచి విశ్రాంతి తీసుకుంటా. యువ ఆటగాళ్లు రావాలనేది నా కోరిక. దానిలో భాగంగానే రిటైర్ అవుతున్నా'అని తెలిపాడు.

ప్రస్తుత తన దృష్టంతా వరల్డ్ కప్ మీదనే ఉందని చెప్పాడు. భారత్‌కు వరల్డ్ కప్ సాధించాలనేది తన కల అని, ఈ ఏడాది వరల్డ్ కప్ కల తీరుతుందని ఆశిస్తున్నట్లు అనూప్ తెలిపాడు. హర్యానాలోని గుర్గావ్ జిల్లాలోని పాల్రా అనే చిన్న గ్రామం నుంచి అనూప్ వచ్చాడు.

ప్రస్తుతం ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా అనూప్ పని చేస్తున్నాడు. 2006లో శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా గేమ్స్‌తో కబడ్డీ జాతీయ జట్టులోకి అనూప్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2012లో అర్జున అవార్డును అందుకున్నాడు.

2016లో భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఎప్పుడూ దూకుడు, తెలివైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు. అనూప్‌ సారథ్యంలో రెండో ప్రొ కబడ్డీ సీజన్‌లో చాంపియన్‌గా నిలిచింది.

అంతక ముందు 2014, 16లో యు ముంబైను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ ప్రొ కబడ్డీ లీగ్‌లో 330 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 305 రైడింగ్ పాయింట్లను సాధించడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+