ప్రొ కబడ్డీ: బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రొ కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కంట్రీ హెడ్ నితిన్ కుక్రేజా, మా టీవీ ఛైర్మన్ మాట్రిక్స్ ప్రసాద్ హీరో అల్లు అర్జున్ పేరును ప్రకటించారు.
ప్రొ కబడ్డీ లీగ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 4 నుంచి 7 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌లో జరిగే పోటీల ప్రారంభంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన అల్లు అర్జున్ జాతీయ గీతాన్ని పాడే అవకాశాన్ని పొందారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ 'కబడ్డీ మనదైన క్రీడ. మన సంస్కృతిలో భాగం. చిన్నప్పుడు కబడ్డీ బాగా ఆడేవాణ్ణి. ఆ తర్వాత మానేశా. సినిమాల తర్వాత అంత ఆసక్తిగా చూస్తానంటే అది క్రీడలే. ఎవరైనా మంచి కథ చెబితే క్రీడా నేపథ్యంలో సినిమా చేయడానికి అభ్యంతరం లేదు' అని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications