Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సందడి: ఒకేచోట చిరు, వెంకయ్య, కేటీఆర్(ఫోటోలు)

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో మ్యాచ్ డ్రా. సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ని డ్రాతో ఆరంభించిన తెలుగు టైటాన్స్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా పుణెతో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌ను టైటాన్స్‌ 29-29తో డ్రా చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషంలో రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ని డ్రా చేసుకుంది.

దీంతో ఇరు జట్లకు మూడేసి పాయింట్లు లభించాయి. దీంతో ఇప్పటి వరకు 42 పాయింట్లతో టైటాన్స్ మొదటి స్ధానంలోకి దూసుకెళ్లగా, పుణె 13 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నది. యు ముంబా (40) రెండో స్థానంలోకి వెళ్లింది. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నా లీగ్‌లో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.

 సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో తెలుగు టైటాన్స్ తడబాటుకు గురైంది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ను పల్టన్‌ టార్గెట్‌ చేసింది. సుఖేశ్ హెగ్డె, దీపక్‌నివాస్ హుడా అంతగా ప్రభావం చూప లేక పోవడంతో పాయింట్ల వేటలో వెనకబడింది. ఈ క్రమంలో పుణె పటిష్ఠ డిఫెన్స్ ముందు టైటాన్స్ రైడర్లు పాయింట్లు రాబట్టలేక సతమతమయ్యారు.

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

తొమ్మిదో నిమిషంలో వజీర్‌ సూపర్‌ రైడ్‌తో టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసి పుణెకు 12-4తో ఆధిక్యం అందించాడు. రాహుల్‌ తన ఐదో రైడ్‌లో ఖాతా తెరవగా, సుఖేష్‌ హెగ్డే వరుసగా పాయింట్లు తెస్తూ జట్టును ఆదుకున్నాడు. 16వ నిమిషంలో సుకేష్‌ సూపర్‌ రైడ్‌తో ఆతిథ్య జట్టు 12-15తో నిలిచింది.

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

తర్వాతి నిమిషంలోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి 16-16తో స్కోరు సమం చేసింది. కానీ, రాహుల్‌ను మరోసారి అవుట్‌ చేసిన పల్టాన్‌ ఆవెంటనే, వజీర్‌ సక్సెస్‌ఫుల్‌ రైడ్‌తో 20-18తో బ్రేక్‌కు వెళ్లింది. ఇక ద్వితీయార్థం ప్రారంభంలోనే వజీర్‌ను రాజగురు టాకిల్‌ చేయగా, దీపక్‌ హుడా రైడ్‌ పాయింట్‌తో 20-20తో స్కోరు సమం చేసింది.

 సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

కానీ, వజీర్‌ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు సాధించడంతో పల్టన్‌ 25-22తో ముందంజ వేసింది. అయితే సుఖేష్‌ రెండు సక్సెస్‌ఫుల్‌ రైడ్లతో పాటు.. 37వ నిమిషంలో వజీర్‌ను టాకిల్‌ చేసి 27-27తో మరోసారి స్కోరు సమం చేయడం మ్యాచ్‌పై ఉత్కంఠ రేపింది.

 సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

చివరి రెండు నిమిషాల్లో మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు చేర్చింది. రైడ్‌కు వెళ్లిన సుఖేష్‌ అవుటయ్యాడు. ఆ వెంటనే ప్రవీణ్‌ నివాలె రైడ్‌ పాయింట్‌ గెలవడంతో పుణె 29-27తో నిలిచి విజయం సాధించేలా కనిపించింది. కానీ, చివరి నిమిషంలో ప్రశాంత్‌ పాయింట్‌ సాధించగా, ఆ వెంటనే ప్రవీణ్‌ను అవుట్‌ చేసిన టైటాన్స్‌ 29-29తో స్కోరు సమం చేసింది.

 సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

సెలబ్రిటీల సందడి: చిరు, వెంకయ్య, కేటీఆర్

హైదరాబాద్‌ లెగ్‌ పోటీలకు శుక్రవారం చివరి రోజు కావడంతో సెలెబ్రిటీలు పోటెత్తారు. జైపూర్‌ యజమాని అభిషేక్‌ బచ్చన్‌, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు కే.టీ. రామారావు, మహేందర్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి దంపతులు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎంపీలు చిరంజీవి, సీఎం రమేష్‌, జితేందర్‌ రెడ్డి, హీరో శ్రీకాంత్‌, దిల్‌రాజు మ్యాచ్‌లకు హాజరయ్యారు. ఇండియన్‌ ఐడల్‌ శ్రీరామచంద్ర జాతీయగీతం ఆలపించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:17 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+