చైనాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్!
Hockey World Cup 2026: 2026 మహిళల హాకీ ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో భారత్, చైనాలు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే ఆధిక్యం సాధించినప్పటికీ.. భారత మహిళల జట్టు విజయాన్ని దక్కించుకోవడంలో విఫలమై, మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ డ్రా ఫలితంగా భారత్, చైనా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
గోల్స్ సాధించిన నవనీత్, దీపిక
తొలి క్వార్టర్‌లోని ఎనిమిదో నిమిషంలో దీపికా తొలి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించడంతో భారత జట్టు మ్యాచ్‌ను బలంగా ప్రారంభించింది. అయితే భారత జట్టు ఆనందం ఎక్కువసేపు నిలవలేదు, ఎందుకంటే తొలి క్వార్టర్ ముగియడానికి కేవలం ఒక నిమిషం ముందు, 14వ నిమిషంలో చైనా క్రీడాకారిణి జాంగ్ యింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేసింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలిచాయి.

రెండో క్వార్టర్‌లో భారత క్రీడాకారిణి దీపిక మరోసారి పెనాల్టీ కార్నర్ నుంచి ఓ అద్భుతమైన గోల్ చేసి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో చైనా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొదటి సగం 30 నిమిషాలు ముగిసేసరికి, మ్యాచ్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఆ జట్టుకు లభించింది. కానీ మూడో, నాలుగో క్వార్టర్‌లలో చైనా తన పటిష్టమైన డిఫెన్స్‌తో భారత్‌ను ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. మూడో క్వార్టర్ 39వ నిమిషంలో మా నింగ్ చేసిన గోల్‌తో స్కోరు 2-2తో సమమైంది.
మూడో క్వార్టర్ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనప్పుడు ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి . మ్యాచ్ గెలిచే అవకాశం ఇరు జట్లకు లభించింది. కానీ, నాలుగో క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాను 4-0తో ఓడించిన ఇంగ్లాండ్ 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, చైనా, భారత్ చెరో పాయింట్‌తో వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. భారత్ మంగళవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

