
ఇంగ్లాండ్‌కు చెమటలు పట్టించి
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఊహించినదాని కన్నా మెరుగైన ప్రదర్శనే చేసింది. ఇంగ్లాండ్‌కు చెమటలు పట్టించింది. ఇంగ్లాండే ఎక్కువ స్కోరింగ్ అవకాశాలు సృష్టించుకున్నప్పటికీ తొలి రెండు క్వార్టర్‌లలో భారత్ హోరాహోరీగా తలపడింది. విజయానికి చేరువగా వచ్చినా ఆఖరి నిమిషాల్లో భారత అమ్మాయిలు పట్టు విడవడంతో ఇంగ్లండ్‌జట్టు గోల్ కొట్టి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

ఇంగ్లాండ్‌కు పెనాల్టీ కార్నర్ లభించి
భారత గోల్‌కీపర్ సవిత పూనియా ఇంగ్లాండ్ ప్రయత్నాలను అద్భుతంగా అడ్డుకుంది. మ్యాచ్ మొదలయ్యాక 32వ సెకన్లోనే ఇంగ్లాండ్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఎనిమిదో నిమిషంలో మరొకటి వచ్చింది. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ భారత రక్షణశ్రేణి గోడలా నిలిచింది. రెండో క్వార్టర్‌లో ఇంగ్లాండ్ మరో రెండు కార్నర్‌లు సాధించింది. కానీ చురుగ్గా కదిలిన సవిత.. ప్రమాదాన్ని తప్పించింది. అదే సమయంలో ఎటాకింగ్ గేమ్‌తో ఇంగ్లాండ్ రక్షణశ్రేణిని భారత్ బోల్తా కొట్టించింది.

జట్టు ప్రయత్నాన్ని భారత డిఫెన్స్ అడ్డుకుని
నేహా 25వ నిమిషంలో గోల్ కొట్టి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చింది. విరామానికి 1-0 నిలిచిన భారత్.. బలమైన డిఫెన్స్‌తో మూడో క్వార్టర్ ముగిసే వరకు ఆధిక్యాన్ని నిలుపుకుంది. ఆఖరి క్వార్టర్‌లో ఇంగ్లాండ్.. స్కోరు సమం చేసేందుకు దాడులను తీవ్రతరం చేసింది. 48వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ ఆ జట్టు ప్రయత్నాన్ని భారత డిఫెన్స్ అడ్డుకుంది. ఐతే ఆరు నిమిషాల తర్వాత వచ్చిన అవకాశాన్ని మాత్రం ఇంగ్లాండ్ వృథా చేయలేదు.

ఇంగ్లాండ్ సద్వినియోగం చేసుకుంది
భారత్ విజయం దిశగా సాగుతున్న దశలో, దక్కిన ఆరో పెనాల్టీ కార్నర్‌ను ఇంగ్లాండ్ సద్వినియోగం చేసుకుంది. మొదటి ప్రయత్నాన్ని సవిత అడ్డుకుంది. కానీ వెనక్కి వచ్చిన బంతిని ఓస్లే నెట్లోకి కొట్టేసింది.
ఇంగ్లండ్ జట్టుకు 5 పెనాల్టీ కార్నర్లు లభించినా వాటిని గోల్స్‌గా మారకుండా సవిత నిలువరించినా ఆఖరు నిమిషాల్లో రీబౌండ్ షాట్ ద్వారా లిల్లీ గోల్‌తో భారత్‌కు విజయం చేజారింది. తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు ..ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.


Click it and Unblock the Notifications












