న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇటలీతో పోరు.. అమీతుమీ తేల్చుకోనున్న టీమిండియా

Womens Hockey World Cup 2018, India vs Italy: When And Where To Watch, Live Coverage On TV, Live Streaming Online

హైదరాబాద్: హాకీ ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జట్టు నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. కప్‌లో నిలవాలంటే ఇక ప్రతిమ్యాచ్‌ గెలవాల్సిందే. గత మ్యాచ్‌లో యుఎస్‌ఏతో డ్రా చేసుకొని క్వార్టర్స్‌ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకున్న భారత జట్టు మరో కఠిన పరీక్షను ఎదుర్కొనబోతుంది. కీలక మ్యాచ్‌లో అమెరికాను నిలువరించి నాకౌట్ బెర్త్‌ను దక్కించుకున్న భారత మహిళల జట్టు.. హాకీ ప్రపంచకప్‌లో మరో పోరుకు సిద్ధమైంది.

అమీతుమీకి సిద్ధమైన భారత్‌

అమీతుమీకి సిద్ధమైన భారత్‌

గెలిస్తేనే ముందంజ వేసే పరిస్థితుల్లో తమకంటే తక్కువస్థాయి ప్రత్యర్థితో అమీతుమీకి సిద్ధమైంది. తుది ఎనిమిది జట్లలో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో మంగళవారం ప్లేఆఫ్‌ పోరులో ఇటలీతో తలపడనుంది. పదో ర్యాంకులో ఉన్న భారత్‌ ఇప్పటివరకు ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు.

ఈ మ్యాచ్‌లో భారత్‌యే ఫేవరేట్‌

ఈ మ్యాచ్‌లో భారత్‌యే ఫేవరేట్‌

పూల్-బిలో ఓ ఓటమి, రెండు డ్రాలతో ప్రపంచ 10వ ర్యాంకర్ భారత్ నాకౌట్ బెర్త్‌ను దక్కించుకోగా, పూల్-ఏలో ఇటలీ చైనా (3-0), కొరియా (1-0)తోపై గెలిచి, 1-12తో నెదర్లాండ్స్ చేతిలో ఓడి ఈ పోరుకు అర్హత సాధించింది. దాంతో 17వ ర్యాంకులో ఉన్న ఇటలీతో మ్యాచ్‌లో తమ సత్తాచాటాలని రాణి రాంపాల్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. భారత్ ఈ మ్యాచ్ కోసం కొత్త వ్యూహాలను అమలు చేయబోతుంది.

స్ఫూర్తిదాయక ఆటతీరే లక్ష్యంగా

స్ఫూర్తిదాయక ఆటతీరే లక్ష్యంగా

యూఎస్‌పై చూపిన స్ఫూర్తిదాయక ఆటతీరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి శక్తి సామర్థ్యాలతో ఈ మ్యాచ్ ఆడుతామని కెప్టెన్ రాణి రాంపాల్ ధీమా వ్యక్తం చేశారు. 'మా ఆటపై నమ్మకం ఉంది. బలానికి తగ్గట్టుగా ఆడుతాం. సానుకూలమైన అంశాలతోనే ఇటలీని నిలువరించేందుకు ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మేజర్ టోర్నీల్లో రాణించేందుకు మార్గం సుగమమవుతుంది' అని రాణి పేర్కొంది.

భారత్ గెలిస్తే క్వార్టర్‌ఫైనల్లో ఐర్లాండ్‌తో

భారత్ గెలిస్తే క్వార్టర్‌ఫైనల్లో ఐర్లాండ్‌తో

మరోవైపు డచ్ చేతిలో భారీ తేడాతో ఓడిన ఇటలీని తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే డిఫెన్స్, ఫార్వర్డ్ శ్రేణి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఓవరాల్‌గా 2015 హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్లో ఇటలీపై షూటౌట్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మ్యాచ్‌ రాత్రి 10.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌- 2లో ప్రసారమవనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గురువారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.

Story first published: Tuesday, July 31, 2018, 10:33 [IST]
Other articles published on Jul 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X