న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2020: మహిళలు కాంస్యం సాధిస్తారా?.. టోక్యోలో రేపటి భారత షెడ్యూల్ ఇదే!!

Here is Indias schedule on August 6th

హైదరాబాద్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020​లో సెమీస్​లో ఓడి చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. వీరోచిత పోరాటంతో యావత్​ దేశ ప్రజల మనసును దోచుకున్నాయి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు. అంచనాలను అందుకున్న పురుషుల జట్టు గురువారం జరిగిన మ్యాచ్​లో జర్మనీపై అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించింది. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి తొలి పతకం రావడంతో దేశమంతగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక భారత మహిళల జట్టు కూడా శుక్రవారం ఉదయం జరిగే పోరులో గ్రేట్​ బ్రిటన్​ను ఓడించి పతకం పట్టాలని చోస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై 2-1తో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. దేశానికి మహిళల హాకీలో తొలి ఒలింపిక్స్​ పతకం అందించడానికి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కెప్టెన్​ రాణి రాంపాల్​ ధీమా వ్యక్తం చేసింది. మరి ఈ ఉత్కంఠ పోరులో మన మహిళలు పతకాన్ని సాధించి దేశ ప్రజల అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.

మరోవైపు రెజ్లింగ్​లో భజరంగ్​ పునియాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి. అతడు పతకం సాధిస్తాడని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. ఉదయం 8 గంటలకు ఈ పోరు జరగనుంది. అథ్లెటిక్స్, గోల్ఫ్ విభాగాల్లో కూడా భారత్ రేపు తలపడనుంది. గురుప్రీత్​ సింగ్, అదితి అశోక్​, దీక్ష దగర్, సీమ బిస్లా, ప్రియాంక గోస్వామిపై భారత్ పతక ఆశలు పెట్టుకుంది. వీరందరూ శుక్రవారం సత్తాచాటాలని ప్రతి భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు.

శుక్రవారం భారత షెడ్యూల్ ఇదే:
# అథ్లెటిక్స్​- అర్ధరాత్రి 2 గంటల నుంచి
పురుషుల 50 కి.మీ. రేస్​ వాక్​ ఫైనల్​-గురుప్రీత్​ సింగ్​

# గోల్ఫ్​
మహిళల రౌండ్​-3 (5.29 నుంచి) అదితి అశోక్​, దీక్ష దగర్​

#హాకీ
కాంస్య పతక పోరు: టీమ్​ఇండియా X గ్రేట్​ బ్రిటన్ (ఉదయం 7గంటలకు)

# రెజ్లింగ్
పురుషుల ఫ్రీ స్టైల్​ 65 కిలోలు: భజరంగ్​ పునియాxఎర్నాజర్​- ఉదయం 8 గంటలకు

మహిళల ఫ్రీస్ట్లై 50కిలోలు: సీమ బిస్లాxసర్ర హమ్ది(తునిషియా)- ఉదయం 8 గంటలకు

#అథ్లెటిక్స్​
20 కిలోమీటర్ల రేస్​ వాక్ ఫైనల్​​: ప్రియాంక గోస్వామి, భావ్నా జత్- మధ్యాహ్నం ఒంటి గంటకు.​
4x400 మీటర్ల రిలే రౌండ్​ 1 హీట్ 2: సాయంత్రం 5.07 గంటలకు ​

Story first published: Thursday, August 5, 2021, 23:56 [IST]
Other articles published on Aug 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X