'హాకీని ముందుకు తీసుకెళ్లడానికి అతడే సరైన వ్యక్తి'
న్యూఢిల్లీ: భారత హాకీ కోచ్‌గా టెర్రీ వాల్ష్ మంగళవారం తన పదవి నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. కొత్త కాంట్రాక్టుపై స్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో చర్చలు విఫలమవడంతో వాల్ష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాల్ష్ ప్రస్తుత కాంట్రాక్ట్ బుధవారంతో ముగియనుంది.
నిర్ణయాల్లో పూర్తి అధికారాలు, స్వతంత్రత కల్పించాలని, అలాగే భారత్‌లో తాను ప్రత్యక్షంగా ఉండి సమీక్షించాల్సిన వ్యవహారాలు లేని సమయంలో తన సొంత దేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లే విధంగా నూతన ఒప్పందాన్ని రూపొందించాలని వాల్ష్ డిమాండ్‌కు హెచ్‌ఐ, సాయ్ అంగీకరించకపోవడంతో వాల్ష్ గత నెలలోనే రాజీనామా చేశాడు.
ఐతే అతడిని కొనసాగించేందుకు చర్చలు జరిగాయి. వాల్ష్ మంగళవారం ఉదయం క్రీడల మంత్రి సోనోవాల్‌ను కలిశాడు. కానీ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో అతని పరిశీలనకు కొత్త ప్రతిపాదన పంపనున్నారు. వాల్ష్ కూడా భారత్ కోచ్‌గా కొనసాగుతాననే ఆశాభావంతో ఉన్నాడు.

హాకీ కోచ్‌గా తప్పుకున్న వాల్ష్, కొత్త కాంట్రాక్టు
భారత హాకీ కోచ్‌గా టెర్రీ వాల్ష్ మంగళవారం తన పదవి నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. కొత్త కాంట్రాక్టుపై స్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తో చర్చలు విఫలమవడంతో వాల్ష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాల్ష్ ప్రస్తుత కాంట్రాక్ట్ బుధవారంతో ముగియనుంది.

హాకీ కోచ్‌గా తప్పుకున్న వాల్ష్, కొత్త కాంట్రాక్టు
వాల్ష్ మంగళవారం ఉదయం క్రీడల మంత్రి సోనోవాల్‌ను కలిశాడు. కానీ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో అతని పరిశీలనకు కొత్త ప్రతిపాదన పంపనున్నారు. వాల్ష్ కూడా భారత్ కోచ్‌గా కొనసాగుతాననే ఆశాభావంతో ఉన్నాడు.

హాకీ కోచ్‌గా తప్పుకున్న వాల్ష్, కొత్త కాంట్రాక్టు
తన డిమాండ్ల ప్రకారం ప్రతిపాదన ఉంటుందని భావిస్తున్నానని చెప్పాడు. వాల్ష్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు సాయ్ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యలు కమిటీ కూడా క్రీడల మంత్రిని కలుసుకుంది.

హాకీ కోచ్‌గా తప్పుకున్న వాల్ష్, కొత్త కాంట్రాక్టు
భారత హాకీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హాకీ ఇండియా విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవల దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన హాకీ పోటీల్లో స్వర్ణం సాధించిన హాకీ ఇండియా జట్టు.
తన డిమాండ్ల ప్రకారం ప్రతిపాదన ఉంటుందని భావిస్తున్నానని చెప్పాడు. వాల్ష్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు సాయ్ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యలు కమిటీ కూడా క్రీడల మంత్రిని కలుసుకుంది.
"కోచ్‌గా వాల్ష్ పనితీరును మంత్రి మెచ్చుకున్నారు. భారత హాకీని ముందుకు తీసుకెళ్లడానికి అతడే సరైన వ్యక్తని అభిప్రాయపడ్డారు. వాల్ష్ ప్రతిపాదనలను ఆయన జాగ్రత్తగా విన్నారు. అన్నింటీకి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఐతే ఆస్టేలియా వెళ్లేందుకు తనకు కొన్ని రోజుల విరామం కావాలని అడిగాడు." అని కమిటీ సభ్యుడు, సాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ సెతియా చెప్పాడు.
డిమాండ్లకనుగుణంగా నూతన ఒప్పందానికి హెచ్‌ఐ అంగీకరిస్తే తన రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వాల్ష్ కూడా మీడియా సమావేశంలో తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications