Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదరగొట్టిన భారత హాకీ టీం.. నాలుగోసారి ఫైనల్ దూసుకెళ్లిన టీమిండియా!

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో హాట్‌ ఫేవరెట్‌ భారత్‌ నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో ఫైనల్‌లో అడుగు పెట్టింది. శుక్రవారం నాడు జరిగిన సెమీఫైనల్లో భారత్ జట్టు తన ప్రత్యర్థి జపాన్‌కు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ మ్యచ్‌లో 5-0తో జపాన్‌ను చిత్తుచేసింది.

ఈ క్రమంలో శనివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో భారత్ పోటీ పడుతుంది. ఈ టైటిల్ కోసం మలేసియాతో ఢీకొట్టనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాళ్లు ఆకాశ్ దీప్‌సింగ్‌ ఆట మొదలైన 19వ నిమిషయంలోనే గోల్‌తో అలరించాడు. ఆ తర్వాత 23వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కూడా గోల్ చేశాడు. ఇక మన్‌దీప్ సింగ్‌ కూడా చెలరేగాడు.

Indian Hockey team defeats Japan in semifinals

అతను 30వ నిమిషంలో గోల్ చేశాడు. అనంతరం 39వ నిమిషంలో సుమిత్‌, 51వ నిమిషంలో కార్తీ సెల్వం కూడా గోల్స్‌తో రాణించారు. మ్యాచ్ మొదటి క్వార్టర్‌లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. కానీ ఆ తర్వాత జపాన్‌ డిఫెన్స్‌ మెరుగైంది. దీంతో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించినా ఖాతా తెరవలేక పోయింది.

అయితే, రెండో క్వార్టర్‌లో మరింత విజృంభించిన టీమిండంయా.. జపాన్‌ డిఫెన్స్‌ను బద్దలు కొట్టిందిజ వనేఃగా మూడు గోల్స్‌తో చెలరేగింది. 19వ నిమిషంలో ఆకాశ్‌ అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ 1-0తో పైచేయి సాధించింది. ప్రత్యర్థి కీపర్‌కు తగిలి వచ్చిన బంతిని ఆకాశ్‌ గోల్‌లోకి పంపాడు. మరో నాలుగు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీ కార్నర్‌ను డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచాడు.

Indian Hockey team defeats Japan in semifinals

అనంతరం 30వ నిమిషంలో ప్రత్యర్థి డిఫెన్స్‌ను బోల్తా కొట్టించిన మన్‌దీప్ మరో ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత జట్టు 3-0తో స్పష్టమైన ఆధిక్యంలోక దూసుకెళ్లింది. ఇదే జోరు కొనసాగించిన టీమిండియా ఆటగాళ్లు.. ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడికి దిగారు. దీంతో భారత మరిన్ని గోల్స్ చేస్తుందని ఫ్యాన్స్‌ ఎంతో ఆశించారు.

కానీ, చివరి రెండు క్వార్టర్స్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన రెండు గోల్స్‌ మాత్రమే చేయగలిగింది. సరిపెట్టింది. 39వ నిమిషంలో సుమిత్‌ ఫీల్డ్‌ గోల్‌ చేయగా.. 51వ నిమిషంలో కార్తీ సెల్వం భారత్‌కు ఐదో గోల్‌ అందించాడు. ఇక కాంస్యం పోరులో కొరియా, జపాన్‌ తలపడతాయి. ఈ మ్యాచ్ కూడా శనివారమే జరగనుంది.

Story first published: Saturday, August 12, 2023, 11:23 [IST]
Other articles published on Aug 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+