
స్పెయిన్‌కు నో ఛాన్స్
ఆ తర్వాతి క్వార్టర్‌లో కూడా భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బంతిని ఎక్కువగా తమ వద్దనే ఉంచుకుంటూ మరో గోల్ చేసే అవకాశాలను వెతుక్కుంది. 21 నిమిషంలో స్పెయిన్ ఆటగాడు ఇగ్లెసిస్ గోల్ చేసేందు భారత్ హాఫ్‌లోకి దూసుకొచ్చాడు. అయితే అక్కడే ఉన్న రోహిదాస్ దాన్ని క్లియర్ చేసేశాడు. దీంతో స్పెయిన్‌కు గోల్ చేసే ఛాన్స్ కూడా దక్కలేదు. కాసేపటికే షంషేర్ చేసిన ట్యాకిల్ వల్ల స్పెయిన్‌కు పెనాల్టీ కార్నర్ దక్కింది. స్పెయిన్ మంచి షాట్ కొట్టినా గోల్ కీపర్ కిషన్ పాఠక్ సేవ్ చేశాడు.

అవకాశాలు ఫెయిల్..
రెండో క్వార్టర్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా టీమిండియా ప్లేయర్ హర్దీప్ సింగ్ అద్భుతంగా దూసుకొచ్చి గోల్ చేశాడు. దీంతో భారత జట్టు లీడ్ రెట్టింపు అయింది. ఆ వెంటనే ఇగ్లెసిస్‌కు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కానీ దాన్ని గోల్‌గా మలచడంలో అతను విఫలమయ్యాడు. ఇండియన్ ప్లేయర్ ఆకాష్‌దీప్‌ను వెనుక నుంచి తోయడంతో భారత్‌కు కూడా పెనాల్టీ కార్నర్ దక్కింది. హర్మన్‌ప్రీత్ ఈ షాట్ తీసుకోగా దాన్ని స్పెయిన్ గోల్ కీపర్ అద్భుతంగా సేవ్ చేశాడు. ఆ తర్వాత భారత్‌కు దక్కిన మరికొన్ని అవకాశాలను ఆ జట్టు క్యాష్ చేసుకోలేకపోయింది. లేదంటే భారత జట్టు నాలుగు గోల్స్ చేయాల్సింది.

చివర్లో ఎల్లో కార్డ్..
నాలుగో క్వార్టర్‌లో భారత్‌కు అంపైర్లు ఎల్లో కార్డ్ ఇచ్చారు. దీంతో టీమిండియా ప్లేయర్ అభిషేక్ పది నిమిషాల పాటు ఆటకు దూరమయ్యాడు. అయినా సరే ఇనుప గేట్ల వంటి డిఫెన్స్‌తో భారత జట్టు ఆకట్టుకుంది. స్పెయిన్‌కు గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆట ముగిసే సమయానికి తమ 2 గోల్స్ ఆధిక్యాన్ని కాపాడుకుంది. తద్వారా హాకీ వరల్డ్ కప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. అయితే ఈ 2-0 స్కోరు మాత్రం భారత్ ఆటతీరును ఏమాత్రి రిఫ్లెక్ట్ చేయదని, వాళ్లు చాలా అద్భుతంగా ఆడారని మాత్రం అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications












