న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో క్రికెట్ తప్ప ఇంకేం చూడరు: తాప్సీ

Tapsee Pannu condemns cricket’s popularity in India over any other sport

హైదరాబాద్: భారత్‌లో అన్ని క్రీడలు కంటే క్రికెట్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పాపం ఈ విషయం తాప్సీకి ఇప్పుడే తెలిసిందట. ఇక ఆలస్యం లేకుండా మొదలుపెట్టేసింది క్రికెట్ అభిమానులపై వాదన. జాతీయ క్రీడ హాకీని వదలిపెట్టి క్రికెట్‌ను అంతగా ఆదరిస్తున్నందుకు నోరు పారేసుకుంటుంది. దానికి తగ్గట్టే ఒక పక్క రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్ 2018ను ప్రపంచ వ్యాప్తంగా వీక్షిస్తున్నా.. భారత్‌లో మాత్రం క్రికెట్ కు మాత్రమే అంత ఆదరణ వస్తుందని నంబర్లలోనే తెలుస్తుంది.

ప్రముఖ టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన తాప్సీ ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడటానికి.. మిగిలిన క్రీడలకు ఆదరణ లోపిస్తుందని వాపోవడానికి.. హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్, అథ్లెటిక్స్‌లపై జాలి చూపడానికి కారణం.. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్న 'సూర్మా' అనే బాలీవుడ్ మూవీ.. జూలై 13న విడుదలకు సిద్ధమైంది. పనిలో పనిగా క్రీడల గురించి మాట్లాడితే సినిమా ప్రమోషన్ కూడా వస్తుందనుకుందేమో మొదలుపెట్టేసింది.

Tapsee Pannu condemns cricket’s popularity in India over any other sport

'జాతీయ క్రీడ హాకీకు ఇలా ఆదరణ తక్కువగా చూస్తున్నారని నాకు ఇప్పటి వరకూ తెలియదు. దురదృష్టవశాత్తు క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మరే క్రీడకు భారత్‌లో లభించట్లేదు. ఈ విషయాన్ని హాకీ సూపర్ స్టార్ సందీప్ సింగ్ గురించి తెలుసుకుంటుంటే నాకర్థమైంది. భారత జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ తనకు గాయమైన తర్వాత కూడా తిరిగొచ్చి భారత జాతీయ జట్టులో ఆడారు. సందీప్.. కల్కా న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైయ్యారు'

ఈ విషయాన్ని తెలుసుకున్న తాప్సీ .. తాను క్రీడా ఔత్సాహికురాలు అయినప్పటికీ ఇప్పుడే తెలుసుకున్న విషయాన్ని ఇప్పుడే బయటపెట్టింది. ప్రమాదం అనంతరం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి కెప్టెన్సీ చేసినందుకు గాను తెగ పొగిడేసింది. అతన్ను చూస్తే క్రీడాకారుడిలో ఉండే ఉత్సాహం కనబడుతుందని తెలిపింది.

Story first published: Wednesday, July 11, 2018, 16:23 [IST]
Other articles published on Jul 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X