Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్ మార్పు: సునీతా లక్రాకు భారత హాకీ పగ్గాలు

Sunita Lakra to captain India in Asian Champions Trophy

హైదరాబాద్: భారత హాకీ జట్ల కోచ్‌లను మార్చేసిన హాకీ ఇండియా బుధవారం మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ను కూడా మార్చేసింది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత హాకీ జట్టును నడిపించిన రాణి రాంపాల్‌కు విశ్రాంతి కల్పించి సీనియర్ డిఫెండర్ సునీతా లక్రాకు పగ్గాలు అప్పగించింది.

దీంతో కొరియాలోని డాంగే నగరంలో మే 13 నుంచి జరిగే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టుకు సునీత లక్రా నాయకత్వం వహించనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ విశ్రాంతి కారణంగా ఈ టోర్నీకి దూరమైంది. ఈ మెగా టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

గోల్‌కీపర్‌ సవిత వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. టోర్నీలో భాగంగా భారత్‌ తన తొలిమ్యాచ్‌ను మే 13న జపాన్‌తో ఆడనుంది. 18 మంది సభ్యులతో కూడిన జట్టులో దీపిక, ఎక్కా, సుమన్ దేవి, గుర్జిత్ కౌర్ వంటి అనుభవం ఉన్న క్రీడాకారిణులు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

ఈ సారి అనుభవజ్ఞులు, యువ ప్రతిభావంతులతో కూడిన తమ జట్టు కచ్చితంగా టైటిల్‌ను నిలబెట్టుకుంటుందని కెప్టెన్‌ సునీత లక్రా ఆశాభావం వ్యక్తం చేసింది. గత ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (2016) ఫైనల్లో చైనాను ఓడించి భారత జట్టు టోర్నీ విజేతగా నిలిచింది.

Story first published: Thursday, May 3, 2018, 11:21 [IST]
Other articles published on May 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+