Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీ వరల్డ్ కప్: కెప్టెన్‌గా రాణి రాంపాల్‌, తెలుగమ్మాయి రజనికి చోటు

 Striker Rani Rampal to lead Indian team in Women’s hockey world cup

హైదరాబాద్: లండన్ వేదికగా జులైలో ప్రారంభం కానున్న మహిళల హాకీ వరల్డ్ కప్ జట్టులో తెలుగు తేజం రజని ఇతిమరపుకు చోటు దక్కింది. స్పెయిన్ పర్యటనకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు వరల్డ్ కప్‌కు ఆమెను ఎంపిక చేశారు. 18 మంది సభ్యుల ఈ భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ రాణి రాంపాల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జులై 21 నుంచి జరిగే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్‌ ఆతిధ్యం ఇవ్వనుంది. మొత్తంగా 16 జట్లు ఈ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో పూల్‌ బిలో భారత్‌ జట్టు ఉంది. గ్రూప్-బిలో భారత్‌తో పాటు ఆతిథ్య ప్రపంచ 2వ ర్యాంక్ ఇంగ్లండ్, 7వ ర్యాంక్ యూఎస్‌ఏ, 16వ ర్యాంక్ ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.

కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక కాగా, గోల్‌కీపర్ సవిత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డిఫెన్స్ విభాగంలో సునీత లక్రా, గుర్జిత్ కౌర్, యువ ప్లేయర్ రీనా ఖొకర్ ఉన్నారు. మిడ్‌ఫీల్డ్‌లో నమిత టొప్పొ, లిలిమ మింజ్, మోనిక, నెహా గోయల్, నవ్‌జోత్ కౌర్, నిక్కి ప్రధాన్‌లకు చోటు దక్కింది.

రాణి రాంపాల్ మరోసారి ఫార్వర్డ్‌లో ఆడనుంది. ఇందులో వందన కటారియా, నవీనీత్ కౌర్, లల్రెమిసియామి, ఉదిత కూడా ఉన్నారు. జట్టు ఎంపికపై చీఫ్ కోచ్ ఎస్‌జోర్న్ మారిజ్నే మాట్లాడుతూ "నేషనల్ క్యాంప్‌లో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. అలాంటప్పుడు 18 మందిని మాత్రమే ఎంపిక చేయడమనేది చాలా కష్టం. మహిళల వరల్డ్ కప్‌కు ఉత్తమ జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాం" అని అన్నారు.

హాకీ వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత మహిళా జట్టు:
గోల్ కీపర్లు: సవిత (వైస్ కెప్టెన్), రజని ఎతిమార్పు. ఢిఫెండర్లు సునీ తలక్రా, దీప్‌గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖొకర్.
మిడ్ ఫీల్డర్లు: నమిత టోప్పో, లీలిమా మింజ్, మోనికా, నేహా గోయాల్, నవజోత్ కౌర్, నిక్కి ప్రధాన్.
ఫార్వర్డ్స్: రాణిరాంపాల్ (కెప్టన్), వందన కార్తీకేయ, నవనీత్ కౌర్, లాల్‌రేమ్ సియామి, ఉదిత.

Story first published: Thursday, July 19, 2018, 13:08 [IST]
Other articles published on Jul 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+