అమ్మాయిలతో అసభ్యంగా: మహిళా హకీ కోచ్ అరెస్టు

పోలీసుల కథనం ప్రకారం - అంగద్ సింగ్ జమ్మూ కాశ్మీర్ జట్టుతో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన టోర్నమెంటులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. జమ్మూ కాశ్మీర్ జట్టు శుక్రవారం టోర్నమెంట్ నుంచి ఓటమితో తప్పుకోవాల్సి వచ్చింది. టోర్నమెంట్ నిర్వాహకుల్లో ఒకరైన డైరెక్టర్ జనరల్ (శిక్షణ) తేజ్‌దీప్ కౌర్ మీనన్‌ను పంజాబ్‌కు చెందిన కొంత ఆటగాళ్లు కలిసి అంగద్ సింగ్‌పై ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో పాటియాలా, ఢిల్లీ మధ్య అంగత్ సింగ్ తాము ప్రయాణించిన రైలులోనే అంగద్ సింగ్ ప్రయాణించాడని, ఆ సమయంలో అతను తమతో అసభ్యంగా ప్రవర్తించాడని వారు చెప్పారు. దాంతో పోలీసులు అంగత్ సింగ్ కోసం అన్వేషించారు. అయితే, జట్టును వదిలేసి అతను అప్పటికే వెళ్లిపోయినట్లు తెలిసింది.
అతని సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని అతని జాడను తెలుసుకున్నారు. అతను ఢిల్లీకి వెళ్లే రైలులో ఉన్నట్లు కనిపెట్టారు. రైల్వే పోలీసుల సహకారంతో సైబరాబాద్ పోలీసులు అంగత్ సింగ్‌ను పట్టుకున్నారు. అతన్ని తిరిగి హైదరాబాదుకు తీసుకుని వచ్చారు. పంజాబ్ ఆటగాళ్ల ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు అంగద్ సింగ్‌పై కేసు నమోదు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications