
ప్రణాళికలను సమర్థంగా అమలు చేయలేకపోయిన టీమిండియా తొలి అర్ధభాగంలో గోల్స్ చేయలేకపోయింది. పదునైన దాడులతో చెలరేగి డచ్ ఆటగాళ్లు అనుకున్న ఫలితాన్ని రాబట్టారు. ఒకరి గోల్ పోస్ట్‌వైపు మరోకరూ దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. 19వ నిమిషంలో రాబర్ట్ మొదటి గోల్ సాధించి పెట్టాడు. 28వ నిమిషంలో రొడెరిక్ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. రెండో అర్ధభాగంలో భారత శిబిరం వ్యూహం మార్చి వేగంగా ఆడుతూ అటాకింగ్‌కు దిగింది. దీంతో 44వ నిమిషంలో ధరమ్‌వీర్ సింగ్, 47వ నిమిషంలో శివేంద్ర సింగ్ గోల్స్ సాధించారు. అయితే 50వ నిమిషంలో మింక్ వండర్ చేసిన గోల్‌తో నెదర్లాండ్స్ మళ్లీ పైచేయి సాధించింది.
తర్వాత గోల్స్ కోసం భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో భారత్.... న్యూజిలాండ్‌తో తలపడుతుంది. మరో మ్యాచ్‌ల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 6-0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కెప్టెన్ జెమీ డ్వేయర్ 'హ్యాట్రిక్'తో చెలరేగాడు. ఈ మూడు గోల్స్‌తో అతను ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్ హాగర్ (179 గోల్స్) రికార్డును సమం చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో కొరియా 2-0తో న్యూజిలాండ్‌పై గెలవగా; స్పెయిన్, పాకిస్థాన్ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది.
తెలుగు వన్ఇండియా