భారత హాకీ: మళ్లీ ఓటమి, నాకౌట్ అశలు గల్లంతు

న్యూజిలాండ్ ఆటగాడు రెండు నిమిషాల్లోనే ఆండ్రూ హెవార్డ్ గోల్ సాధించి కివీస్ స్కోరును సమం చేశాడు. 24వ నిమిషంలో ఫిలిప్ బరోస్ న్యూజిలాండ్‌కు రెండో గోల్ అందించగా.. ఆ తర్వాత ఐదు నిమిషాలకు నికోలస్ విల్సన్ కివీస్‌కు మూడో గోల్ సాధించి పెట్టాడు. తర్వాత భారత హాకీ జట్టు ఎటాకింగ్ గేమ్ ఆడినా ప్రయోజనం లేకపోయింది. రెండవ బాగంలో న్యూజిలాండ్ డిఫెన్స్ ఆడిగా... భారత్ గోల్స్ కోసం ఎంత శ్రమించినా గోల్స్‌ను సాధించలేకపోయింది. దీంతో మ్యాచ్ 12వ నిమిషం, 24వ నిమిషం, 29 నిమిషంలో వరుసగా గోల్స్ సాధించిన న్యూజిలాండ్ భారత్‌పై 3-1 తేడాతో విజయం సాధించింది.
ఒలింపిక్స్‌లో గ్రూప్-బిలో తన తొలి మ్యాచ్‌లో సౌత్‌కొరియాను 0-2తో ఓడించిన న్యూజిలాండ్ బుధవారం నాడు భారత్‌పై సాధించిన విజయంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 2008 రజత పతక విజేత స్పెయిన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి పూల్-ఎలో ఆరుపాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
తెలుగు వన్ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications