For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెయిన్‌తో మ్యాచ్‌ డ్రా చేసుకున్న భారత హాకీ జట్టు

 Spain hold Indian womens hockey team to 2-2 draw

హైదరాబాద్: తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న స్పెయిన్‌పై హాకీ సిరీస్‌ గెలిచే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. గురువారం జరిగిన పోరులో చివరిదైన నాలుగో మ్యాచ్‌ను భారత్‌ 2-2 గోల్స్‌తో డ్రా చేసుకుంది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-1తో ముగించింది.

భారత్‌ తరఫున ఎనిమిదో నిమిషంలో దీప్‌ ఎక్కా గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్ ఆ తర్వాత 26వ నిమిషంలో నవనీత్‌ కౌర్‌ గోల్‌తో భారత ఆధిక్యం 2-0కు చేరింది. అయితే మూడో క్వార్టర్‌లో భారత్‌ నాలుగు నిమిషాల తేడాలో రెండు గోల్స్‌ సమర్పించుకుంది. స్పెయిన్ తరుపున లూసియా (35వ నిమిషం), కార్లా (39వ నిమిషం)లో వరుస గోల్స్‌ చేశారు.

ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయాయి. దీంతో ఈ సిరిస్ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ 3-2తో గెలవగా... రెండో మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. మూడో మ్యాచ్‌లో భారత్‌ 5-2తో గెలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, February 1, 2019, 13:07 [IST]
Other articles published on Feb 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+