అజ్లాన్ షా టోర్నీలో కెప్టెన్‌గా మన్‌ప్రీత్: కీలక ఆటగాళ్లు లేకుండానే!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీకి భారత్ జట్టును బుధవారం ప్రకటించారు. మొత్తం 18 మందితో కూడిన జట్టుకు మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. కాగా, గాయాల కారణంగా ఎస్వీ సునీల్, అక్షదీప్ సింగ్, రమన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, రూపిందర్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, చింగ్లెన్‌సనా సింగ్ ఈ టోర్నీకి దూరమయ్యారు.

గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం
వీరి స్థానంలో వివేక్‌సాగర్, హార్దిక్ సింగ్, సుమిత్, నీలకంఠ, శైలానంద్ లక్రాలాంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. గాయాలబారిన పడిన ఆటగాళ్లందరికీ బెంగళూరులోని సాయ్ సెంటర్లో పునరావాస చికిత్స జరుగుతుందని హాకీ ఇండియా (హెచ్‌ఐ) వెల్లడించింది. గోల్ కీపర్లుగా పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బీ పాథక్‌కు జట్టులో చోటు దక్కింది.

టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తే లక్ష్యంగా
మిడ్‌ఫీల్డర్లుగా మన్‌ప్రీత్, వివేక్ సాగర్ ప్రసాద్, హార్దిక్ సింగ్, సుమిత్, నీలకంఠ శర్మ ఎంపిక చేశారు. ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్ వరకు ఆటగాళ్లందర్ని ఫిట్‌గా ఉంచాలనే లక్ష్యంతో వాళ్లకు శిక్షణ ఇస్తున్నామని హాకీ ఇండియా హైఫెర్‌ఫార్మెన్స్ డైరెక్టర్ డేవిడ్ జాన్ తెలిపాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను సాధించాలంటే భారత జట్టు ఈ సిరీస్‌లో రాణించాలి.

మలేసియాలో మార్చి 23 నుంచి 30 వరకు
మలేసియాలోని ఇపోహాలో మార్చి 23 నుంచి 30 వరకు ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆతిథ్య మలేసియా, కెనడా, కొరియా, దక్షిణాఫ్రికా, జపాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. భారత్ తన తొలిమ్యాచ్‌ను మార్చి 23న జపాన్‌తో ఆడనుంది.

భారత పురుషులు హాకీ జట్టు:
మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), శ్రీజేశ్, కృష్ణన్, గురిందర్ సింగ్, సురేందర్. వరుణ్ కుమార్, బీరేం ద్ర లక్రా, అమిత్ రోడాస్, కొతాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ, సుమిత్, వివేక్, మన్‌దీప్ సింగ్, సిమ్రాన్‌జిత్ సింగ్, గుర్జాంత్ సింగ్, శైలేంద్ర లక్రా, సుమిత్ కుమార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications