For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ లీగ్‌ ఫైనల్‌ టోర్నీ: సర్దార్ సింగ్‌కు ఉద్వాసన, కెరీర్ ముగిసినట్టేనా?

By Nageshwara Rao
Sardar Singh axed from India's Hockey World League Final squad

హైదరాబాద్: భువనేశ్వర్‌ వేదికగా డిసెంబర్‌ 1న ఆరంభయ్యే ప్రపంచ హాకీ లీగ్‌ ఫైనల్‌ టోర్నీ కోసం శుక్రవారం హాకీ ఇండియా(హెచ్‌ఐ) ఎంపిక చేసిన 18 మంది జట్టు నుంచి మాజీ కెప్టెన్ సర్దార్‌సింగ్‌ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు.

తొడకండరాల గాయం నుంచి కోలుకున్న రూపిందర్‌సింగ్ ఐదు నెలల తర్వాత తిరిగి ఎంపికయ్యాడు. మరోవైపు ఫిట్‌నెస్‌ సాధించిన బీరేంద్ర లక్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్‌లో భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సర్దార్‌కు చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అక్టోబర్ నెలలో ఢాకాలో ఆసియాకప్‌ గెలిచి భారత జట్టులో సర్దార్‌ సభ్యుడిగా ఉన్నాడు. వరల్డ్‌ లీగ్‌ ఫైనల్‌కు ఎంపిక చేయకపోవడంతో సర్దారా కెరీర్‌ ఇక ముగిసినట్టేనని భావిస్తున్నారు. హాకీ వరల్డ్‌ లీగ్‌లో పాల్గొనే 18 మంది సభ్యుల జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్‌ను కెప్టెన్‌గా, చింగ్లెన్‌సనా సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా హాకీ ఇండియా ఎంపిక చేసింది.

మరోవైపు గోల్‌కీపర్లుగా ఆకాశ్ చిక్టె, సూరజ్ కర్కెరను ఎంపిక చేయగా, పూర్తి ఫిట్‌నెస్ దక్కించుకోని కారణంగా శ్రీజేష్‌కు చోటు దక్కలేదు. భారత్ ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో అర్జెంటీనా, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ బరిలోకి దిగుతున్నాయి.

హాకీ జట్టు:
గోల్ కీపర్లు: Akash Anil Chikte, Suraj Karkera Defenders: Harmanpreet Singh, Amit Rohidas, Dipsan Tirkey, Varun Kumar, Rupinderpal Singh, Birendra Lakra
మిడ్ ఫీల్డర్లు: Manpreet Singh (Capt), Chinglensana Singh (vice-captain), SK Uthappa, Sumit, Kothajit Singh
ఫార్వర్డ్స్: SV Sunil, Akashdeep Singh, Mandeep Singh, Lalit Kumar Upadhyay, Gurjant Singh.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 18, 2017, 9:53 [IST]
Other articles published on Nov 18, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+