న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యాలో వింత: 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుగా AK-47 రైఫిల్

Russian hockey goalkeeper gifted AK-47 assault rifle after putting in man of the match performance - Watch

హైదరాబాద్: సాధారణంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకునే ఆటగాళ్లకు ట్రోఫీ లేదా ప్రైజ్ మనీని బహుకరిస్తుంటారు. అయితే, రష్యాలో మాత్రం ఇందుకు భిన్నంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ప్రదర్శన చేసిన ఆటగాడికి ఏకే-47 రైఫిల్‌ను బహుమతిగా అందించారు. వివరాల్లోకి వెళితే...

రష్యా, చెల్మెట్ దేశాల మధ్య హాకీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రష్యా 3-2తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రష్యా విజయంలో కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ సవేలి కోనోనోవ్‌కు ఆ జట్టు కెప్టెన్ ఏకే-47 రైఫిల్‌ను బహుమతిగా అందించాడు. 23 ఏళ్ల సవేలి కోనోనోవ్ 36 షాట్స్‌ను ప్రత్యర్ధి జట్టు గోల్స్‌గా మలచకుండా అడ్డుకున్నాడు.

భారత్ vs దక్షిణాఫ్రికా 2019: కోహ్లీ, రోహిత్ శర్మ బద్దలు కొట్టబోయే రికార్డులివే!భారత్ vs దక్షిణాఫ్రికా 2019: కోహ్లీ, రోహిత్ శర్మ బద్దలు కొట్టబోయే రికార్డులివే!

దీంతో ప్రత్యర్ధి జట్టు రెండు గోల్స్‌కే పరిమితమైంది. మరోవైపు రష్యా మూడు గోల్స్ చేసి ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత క్లబ్ అధికారులు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి కెప్టెన్‌కు ఏకే-47 రైఫిల్‌ను ఇవ్వగా... దానిని అతడు సవేలి కోనోనోవ్‌కు బహుకరించాడు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పీవీ సింధు.. సన్మానించిన గవర్నర్!!ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పీవీ సింధు.. సన్మానించిన గవర్నర్!!

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రత్యేకమైన 'రివార్డ్' ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ లీగ్‌లలో వింత అవార్డులను అందించే ఆచారానికి శ్రీకారం చుడుతుందేమో చూడాలి మరి.

Story first published: Friday, September 13, 2019, 18:34 [IST]
Other articles published on Sep 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X