రాయ్‌పూర్: 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం హాకీ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన రేణుకా యాదవ్ అనే యువతి జీవితాన్నే మార్చేసింది. పట్టుదల కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించింది.
రియో ఒలింపిక్స్: హాకీ స్క్వాడ్, 36 ఏళ్ల తర్వాత మహిళా టీం, రీతూ ఔట్
వివరాల్లోకి వెళితే... చత్తీస్‌గడ్ రాష్ట్రంలో పనిమనిషి కూతురైన పాలమ్మాయి రేణుకా యాదవ్ తొలి మహిళా ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించారు. చత్తీస్‌గడ్‌లోని రాజ్ నందగామ్ గ్రామానికి చెందిన రేణుకా యాదవ్ అనే యువతి ప్రస్తుతం సెంట్రల్ రైల్వేస్ తరుపున ముంబైలో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్‌గా విధులు నిర్వహిస్తోంది.

చిన్నతనం నుంచే సైకిల్‌పై ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయించేది. పనిమనిషి కూతురైన 22 ఏళ్ల ఆ యువతి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కఠోర సాధన చేసి 16 మంది ఉన్న మహిళా హాకి జట్టులో స్థానం సంపాదించారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రేణుకా యాదవ్ రియో ఒలింపిక్స్‌లో భారత్ జట్టు తరుపున ఆడాలనే తన కలను నిజం చేసుకున్నారు.
హాకీ ఇండియా ప్రకటనతో రేణుకా యాదవ్ ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. తాను పేద కుటుంబంలో పుట్టినా ఎంతో శ్రమ పడి చత్తీస్‌గడ్ రాష్ట్రం తరుపు నుంచి మొట్టమొదటి మహిళా ఒలంపియన్ అయినందకు గర్విస్తున్నానని అన్నారు. తన తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంటుందని, తాను ఇంటింటికి తిరుగుతూ పాలు అమ్మే దాన్నని చెప్పారు.
చిన్నప్పటి నుంచి హాకీ ఆడేదానని, తన మొదటి గురువు భూషణ్ అని చెప్పారు. తాను పాఠశాల దశలో హాకీలో రాణించడం చూసి కోచ్ భూషణ్ మొదటిసారి తనకు హాకి స్టిక్ బహుమతిగా ఇచ్చారని ఆమె చెప్పారు. కోచ్‌ల ప్రోత్సాహం, కఠోర సాధనతో తాను ఒలింపిక్స్‌కు వెళ్లే మహిళా జట్టులో స్థానం సంపాదించటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.