ఇంగ్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా రాణి రాంపాల్

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా రాణి రాంపాల్ వ్వవహారించనుంది. శుక్రవారం 18 మందితో కూడిన భారత హాకీ జట్టుని హాకీ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4 వరకు మార్లో వేదికగా ఈ సిరిస్ జరగనుంది.
ఇటీవలే ఒలింపిక్ టెస్టు ఈవెంట్‌లో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగమ్మాయి రజనీ యతిమరపు గోల్‌కీపర్‌గా తన చోటు నిలుపుకుంది. మరో గోల్ కీపర్ సవిత వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, రీనా, సలీమ డిఫెన్స్ బాధ్యతలు మోయనున్నారు.
భారత జట్టు:
గోల్ కీపర్స్: సవిత (వైస్ కెప్టెన్), రజనీ యతిమరుపు
డిఫెండర్లు: డీప్ గ్రేస్ ఏక్కా, గుర్జిత్ కౌర్, రీనా ఖోఖర్, సలీమా టేటే
మిడ్‌ఫీల్డర్లు: సుశీలా చాను పుఖ్రాంబం, నిక్కి ప్రధాన్, మోనికా, నేహా గోయల్, లిలిమా మిన్జ్, నమితా తోప్పో.
ఫార్వర్డ్ ప్లేయర్లు: రాణి (కెప్టెన్), వందన కటారియా, నవనీత్ కౌర్, లాల్‌రెమ్సియామి, నవజోత్ కౌర్, షర్మిలా దేవి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications