అనుకోకుండా హాకీని కెరీర్‌గా ఎంచుకున్నాడు.. భారత్‌కు మెడల్ తెచ్చాడు! శ్రీజేష్ అసలు కథ ఇదే!!

హైదరాబాద్: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో జర్మనీపై భారత హాకీ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దీంతో 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగరాసింది.

ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో భారత గోల్ కీపర్‌ పీఆర్ శ్రీజేష్ జర్మనీ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్‌లు లభించినప్పటికీ.. అడ్డుగోడగా నిలబడ్డాడు. అద్భతమైన డిఫెన్స్‌తో జర్మనీ ఆటగాళ్ల గోల్స్‌ను అడ్డుకొని 5-4 తో విజయాన్ని భారత్‌కు అందించాడు.

అమ్మ కన్నీరు పెట్టుకుంది

అమ్మ కన్నీరు పెట్టుకుంది

ఈ విజయంపై భారత హాకీ జట్టు కోచ్‌ గ్రాహం రీడ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందన్నారు. మ్యాచ్‌ మొత్తానికి హీరోగా నిలిచిన స్టార్ గోల్‌ కీపర్ పీఆర్ శ్రీజేష్‌ విజయానందం ఉన్నాడు. దీనిపై తన కుటుంబం గర్వంగా ఫీలవుతోందని చెప్పారు. ఈ ఆనందంలో అమ్మ కన్నీరు పెట్టుకుందని తనతో సరిగ్గా మాట్లాడలేకపోయిందని పేర్కొన్నాడు. 'మ్యాచ్ అనంతరం ఇంటికి కాల్ చేశా. ఆనందంలో అమ్మ కన్నీరు పెట్టుకుంది. నాతో సరిగ్గా మాట్లాడలేకపోయింది. నేను కూడా భావోద్వేగానికి గురయ్యా. ఇది పునర్జన్మ అనే చెప్పాలి. ఈ ఘనత కొత్తతరం ఆటగాళ్లను తయారు చేయడంలో సహాయపడుతుంది' అని శ్రీజేష్‌ ధీమా వ్యక్తం చేశాడు.

జీవితమంతా ఆ పోస్ట్‌తోనే

జీవితమంతా ఆ పోస్ట్‌తోనే

అపూర్వ విజయం విజిల్‌ వినిపించగానే నార్త్ పిచ్‌లో పీఆర్ శ్రీజేష్ గోల్‌పోస్ట్ పైకి ఎక్కిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అతడు స్పందించాడు. 'జీవితమంతా పోస్ట్‌తోనే గడిపాను. అది నా ప్లేస్‌. నా కష్టం, నష్టం, సంతోషం, దుఃఖం.. అన్నీ పోస్ట్‌తోనే. అందుకే అలా ఎక్కి వేడుక చేసుకున్నా.

ఆ సమయంలో ఎంతో గర్వంతో ఫీల్ అయ్యాను. ఆ క్షణాలను ఎప్పటికి మరువను' అని భారత గోల్ కీపర్‌ శ్రీజేష్ భావోద్వేగం చెందాడు. భారత జట్టు సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందని, వేడుకలు చేసుకున్నామని శ్రీజేష్ భార్య అనీషా మీడియాతో తెలిపారు. తన భర్త భారత్ రాగానే ఘన స్వాగతం ఉంటుందని, కుటుంబ సభ్యులు అందరూ అందులో పాల్గొంటారని చెప్పారు. ఇక లాంగ్‌ హాలిడే ప్లాన్‌ చేస్తున్నామని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్నో గోల్స్ అడ్డుకున్నాడు

ఎన్నో గోల్స్ అడ్డుకున్నాడు

గురువారం జ‌రిగిన బ్రాంజ్ మెడ‌ల్ మ్యాచ్‌లో భారత జట్టులోని సిమ్రంజీత్ సింగ్ (17, 34 వ నిమిషాలు) తొలి బ్రేస్ సాధించగా.. హార్దిక్ సింగ్ (27 వ), హర్మన్‌ప్రీత్ సింగ్ (29 వ) రూపిందర్ పాల్ సింగ్ (31 వ) గోల్ కొట్టారు. మ్యాచ్ మ‌రో ఆరు సెక‌న్ల‌లో ముగుస్తుంద‌న‌గా.. భారత్ స్కోరును స‌మం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన జ‌ర్మ‌నీ ఆశ‌ల‌ను పీఆర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. చివ‌రి క్షణాల్లో జ‌ర్మ‌నీకి పెనాల్టీ కార్న‌ర్ ద‌క్క‌గా.. దానిని గోల్‌గా మ‌లచి స్కోరు స‌మం చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది.

అయితే ఆ ప్ర‌య‌త్నాన్ని శ్రీజేష్ విజ‌య‌వంతంగా అడ్డుకున్నాడు. దీంతో 5-4 స్కోరుతో గెలిచిన భారత్ బ్రాంజ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకుంది. ఇదొక్క గోలే కాదు.. ఒలింపిక్స్‌ 2020లో గోల్‌కీప‌ర్‌గా శ్రీజేష్ కీల‌క‌స‌మ‌యాల్లో ఎన్నో గోల్స్ అడ్డుకున్నాడు. ఎంతో ఒత్తిడి స‌మ‌యాల్లోనూ చెక్కు చెద‌ర‌ని ఏకాగ్ర‌త‌తో అత‌డు అడ్డుకున్న గోల్సే.. టీమిండియాను సెమీస్‌కు తీసుకెళ్లాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.

అనుకోకుండా హాకీని కెరీర్‌గా ఎంచుకున్నాడు

అనుకోకుండా హాకీని కెరీర్‌గా ఎంచుకున్నాడు

కేర‌ళ‌లోని ఎర్నాకుళం జిల్లా కిళ‌క్క‌మ్‌బాలమ్ అనే గ్రామంలో శ్రీజేష్‌ జన్మించాడు. స్కూల్ రోజుల్లో ఒక్క హాకీ త‌ప్ప అన్ని గేమ్స్‌లనూ అత‌డు ఆడేవాడు. డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, రన్నింగ్‌, లాంగ్ జంప్‌, హైజంప్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్లో స‌త్తా చాటాడు. చివ‌రికి తాను ఏ స్పోర్ట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలో కూడా తెలియ‌ని స్థితిలో పడిపోయాడు.

అయితే అప్ప‌టి వ‌ర‌కూ అస‌లు ఎప్పుడూ ఆడ‌ని హాకీనే త‌న కెరీర్‌గా ఎంచుకున్నాడు. 12 ఏళ్ల వ‌య‌సులో జ‌య‌కుమార్ అనే హాకీ కోచ్ శ్రీజేష్‌ను హాకీ గోల్‌కీపింగ్ వైపు తీసుకెళ్లాడు. ఆపై 2006లో తొలిసారి నేష‌న‌ల్ జట్టులో ఆడిన అతడు సీనియ‌ర్లు ఆడ్రియ‌న్ డిసౌజా, భ‌ర‌త్ ఛెత్రీల నీడ‌లో ఎదిగాడు.

అంచెలంచెలుగా ఎదుగుతూ

అంచెలంచెలుగా ఎదుగుతూ

అంచెలంచెలుగా ఎదుగుతూ భారత ప్ర‌ధాన గోల్‌కీప‌ర్‌గా శ్రీజేష్‌ త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2014లో ఏషియ‌న్ గేమ్స్‌లో భారత్ గోల్డ్ మెడ‌ల్ సాధించ‌డంలో అత‌ని పాత్రే కీల‌కం. ఫైన‌ల్లో పాకిస్థాన్‌పై రెండు పెనాల్టీ స్ట్రోక్స్‌ను అత‌డు తనదైన శైలిలో అడ్డుకున్నాడు. ఆ త‌ర్వాతి ఏడాది చాంపియ‌న్స్ ట్రోఫీలో ఇండియా బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. శ్రీజేష్ 'గోల్‌కీప‌ర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు.

2016 ఒలింపిక్స్‌కు ముందు కెప్టెన్ అయ్యాడు. అయితే ఆ గేమ్స్‌లో ఇండియా క్వార్ట‌ర్‌ఫైన‌ల్లో బెల్జియం చేతిలో ఓడింది. 2020లో టీమిండియా మెడల్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. ఒక‌ప్పుడు 8 గోల్డ్ మెడ‌ల్స్‌తో ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన భారత హాకీ టీమ్‌.. ఇప్పుడు బ్రాంజ్ మెడ‌ల్ గెలిచినా పెద్ద సంబురంగా జ‌రుపుకుంటున్నాం. దేశ‌మంతా ఈ మెడ‌ల్ కోసం ఒక‌టా రెండా.. ఏకంగా నాలుగు ద‌శాబ్దాల పాటు వేచి చూసింది. మొత్తానికి మ‌న్‌ప్రీత్ సేన సాధించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 5, 2021, 15:42 [IST]
Other articles published on Aug 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X