For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ ఇండియా టీమ్ కేప్టెన్‌కు ప్రధాని మోడీ నుంచి ఫోన్ కాల్

PM Narendra Modi spoke to the Indian men’s hockey team captain Manpreet Singh

టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో 12వ రోజు భారత్ పరాజయాలను చవి చూస్తోంది. భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచారు. మహిళల జావెలిన్ థ్రో విభాగంలో ఆమె సత్తా చాటలేకపోయారు. ఆ వెంటనే- ప్రతిష్ఠాత్మంగా భావించిన పురుషుల హాకీ మ్యాచ్‌లోనూ భారత జట్టు ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 ర్యాంక్‌లో ఉన్న బెల్జియం చేతిలో ఓడిండి భారత్. చివరి వరకూ పోరాడినప్పటికీ.. పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. 5-2 గోల్స్ తేడాతో మన్‌ప్రీత్ సింగ్ టీమ్ అపజయంతో తన ప్రస్థానాన్ని ముగించింది.

ఓటమితో నిరాశకు లోనైన భారత హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్సాహాన్ని ఇచ్చారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఆయన టీమ్ కేప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్ మెగా టోర్నమెంట్‌లో అన్ని మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈ ఒక్క ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో తదుపరి మ్యాచ్‌కు సిద్ధం కావాలని మోడీ వారికి సూచించారు. కాంస్య పతకాన్ని సాధించడానికి సర్వశక్తులను కూడగట్టుకోవాలని అన్నారు. ప్రత్యర్థి ఎవరైనప్పటికీ- ధైర్యాన్ని కోల్పోవద్దని, తమదైన శైలిలో మ్యాచ్‌లో సత్తా చాటాలని, స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకోవాలని అకాంక్షించారు ప్రధాని మోడీ.

భారత్-బెల్జియం మధ్య ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ను మోడీ వీక్షించారు. ఆద్యంతం ఆయన ఉత్కంఠభరితంగా టీవీలో మ్యాచ్‌ను తిలకించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు మ్యాచ్ కొనసాగుతోన్న సమయంలో మోడీ ఓ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారంటూ కితాబిచ్చారు. ఆశించిన ఫలితం రాలేదు. 5-2 గోల్స్ తేడాతో భారత్ పరాజయాన్ని చవి చూసింది. ఆ వెంటనే మోడీ.. టీమ్ కేప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆయన చేసిన ఈ ఫోన్ కాల్.. జట్టును పునరుత్తేజితులను చేసి ఉండొచ్చు.

Story first published: Tuesday, August 3, 2021, 10:58 [IST]
Other articles published on Aug 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+