రోడ్లు ఊడ్చిన అమితాబ్, ప్రధాని మోడీ ప్రశంస (ఫోటో)
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ సర్దారా సింగ్‌లను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొని స్పూర్తిగా నిలిచారని ట్విట్టర్‌లో ప్రశంసించారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరికొంత మందిని పాల్గోనేందుకు స్పూర్తి కలిగించారని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మత గురువు బాబా రామ్ రహీంని కూడా మోడీ ట్విట్టర్‌లో అభినందించారు. ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రేరణ కలిగించారని ప్రశంసించారు. హాకీ స్టిక్ తర్వాత సర్దారా సింగ్ చీపురుతో స్కోర్స్ చేస్తున్నారంటూ మోడీ చమత్కరించారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొని స్పూర్తిగా నిలిచారని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముంబయి రోడ్లను శుభ్రం చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కు ముందు 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని 'బిగ్ బి' పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications