Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Great Britain: అంపైరింగ్ అంతా తొండి..!!

IND vs TGB Hockey:పారిస్ ఒలింపింక్స్‌లో భారత హాకీ జట్టు సంచలన విజయాలను నమోదు చేస్తూ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఆదివారం గ్రేట్ బ్రిటెయిన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గి సెమీస్‌కు దూసుకుపోయిన విషయం తెలిసిందే. భారత్ విజయం సాధించినప్పటికీ హాకీ మ్యాచుల్లో అంపైరింగ్‌పై కొంత అనుమానం వ్యక్తం చేసింది హాకీ ఇండియా. అంపైరింగ్ సరిగ్గా లేదంటూ హాకీ ఇండియా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

Hockey Ind vs TGB

ఆదివారం జరిగిన భారత్ గ్రేట్ బ్రిటెయిన్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ పెనాల్టీ షూటౌట్స్ వరకు వచ్చింది. అయితే గ్రేట్ బ్రిటెయిన్ గోల్ కీపర్‌కు పెనాల్టీ షూటౌట్లకు ముందు కోచింగ్ ఇవ్వడాన్ని భారత హాకీ ఫెడరేషన్ తప్పుబట్టింది.అంతేకాదు ఈ సందర్భంగా గ్రేట్ బ్రిటెయిన్ గోల్ కీపర్ వీడియో టాబ్లెట్‌ను వినియోగించడాన్ని హాకీ ఇండియా చాలా సీరియస్‌గా తీసుకుంది. అసలే ఇండియా గ్రేట్ బ్రిటెయిన్ మధ్య పోరును హ్యాండిల్ చేసిన విధానం ఆందోళనకు గురిచేసిందంటూ హాకీ ఇండియా పేర్కొంది.

గ్రేట్ బ్రిటెయిన్ ఆటగాడు విలియం కాల్నన్ ముఖంపై భారత ఆటగాడు అమిత్ రోహిదాస్ స్టిక్ తగలడంతో అమిత్‌కు రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపారు. దీంతో భారత జట్టు 40 నిమిషాల పాటు 10 మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే భారత ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ తొలి గోల్ వేసి ఆధిక్యత సంపాదించింది. అయితే హాఫ్ టైమ్ ముగిసే సరికి ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.ఇక ఆట ముగిసే సమయానికి కూడా ఇరు జట్లు అదే స్కోరుతో ఉన్నాయి.అనంతరం షూటౌట్స్‌లో భారత గోల్ కీపర్ శ్రీజేష్ రెండు గోల్స్‌ను అడ్డుకోవడంతో భారత్ విజయం ఖాయమైంది.

ఇక ఆట ముగిశాక అంపైరింగ్‌తో అసంతృప్తి చెందిన భారత హాకీ సమాఖ్య అధికారులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా కీలక మ్యాచుల్లో అంపైరింగ్ చేసిన విధానం సరిగ్గా లేదని వెల్లడించింది. ఆటపై ప్రభావం చూపేలా కొన్ని సందర్భాల్లో అంపైరింగ్ ఉన్నిందని పేర్కొంది. అస్థిరమైన వీియో అంపైరింగ్ రివ్యూలు,ప్రత్యేకించి భారత ఆటగాడు అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డు నిర్ణయానికి సంబంధించి జరిగిన వీడియో రివ్యూ సిస్టం సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.షూట్-అవుట్ సమయంలో గోల్‌పోస్ట్ వెనుక నుండి గోల్‌కీపర్‌కి శిక్షణ ఇవ్వడం మరియు షూట్-అవుట్ సమయంలో గోల్‌కీపర్ వీడియో టాబ్లెట్‌ని ఉపయోగించడం వంటి చర్యలను ప్రధానంగా ఫిర్యాదులో భారత హాకీ సమాఖ్య హైలైట్ చేసింది.

Story first published: Monday, August 5, 2024, 7:30 [IST]
Other articles published on Aug 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+