
భారత్ సాయం చేస్తుందనే అనుకుంటున్నా
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లోనూ భారత్ తనకు సాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మన్సూర్ అహ్మద్ ఓ జాతీయ ఛానల్‌తో 'ఆపరేషన్ కోసం నేను భారత్ వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే భారత్‌లోనే ఈ శస్త్రచికిత్స సక్సస్ రేటు ఎక్కువగా ఉంది. అంతేకాదు కాలిఫోర్నియాతో పోలిస్తే ఖర్చు కూడా తక్కువ' అని తెలిపాడు.

వీసా కోసం ఎదురుచూస్తున్నాను
'దయచేసి నాకు సాయం చేయండి. నేను డబ్బులు అడగడం లేదు. ఇప్పటికే నా రిపోర్టులను పంపించాను. వీసా కోసం ఎదురుచూస్తున్నాను. నేను ఎంతో మంది భారతీయుల గుండెల్లో బాధను నింపాను. 1989లో ఇందిరా గాంధీ కప్ టోర్నీలో భారత్‌ను పాక్ ఓడించింది. ఇంకా ఎన్నో టోర్నీల్లో మేం గెలిచి వారి బాధకు కారణమయ్యాం' అని పేర్కొన్నాడు.

గుండే ఆపరేషన్ కోసం భారత్ రావాలనుకుంటున్నా
'కానీ, ఇప్పుడు నేను గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం భారత్ రావాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం నుంచి నాకు సాయం కావాలి' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నా.. పాక్ జాతీయులకు భారత్ మెడికల్ వీసాలు ఇస్తుండటంతో మన్సూర్‌కు కూడా భారత్ వీసా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించి మన్సూర్ భారత్ వచ్చేందుకు వీసా మంజూరు చేయాలని అతని అభిమానులు కోరుతున్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి షరీఫ్ లక్ష డాలర్ల ఆర్థిక సాయం
మన్సూర్ చికిత్స నిమిత్తం పంజాబ్ ముఖ్యమంత్రి షరీఫ్ లక్ష డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్ అతని వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తోంది. గోల్ కీపర్ అయిన అహ్మద్ 1994 వరల్డ్ కప్ పైనల్లో నెదర్లాండ్స్ గోల్స్ చేయకుండా అడ్డుకొని పాకిస్థాన్‌కు విజయాన్ని అందించాడు. అంతేకాదు మూడు ఒలింపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












