Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాతో కలిసి హాకీ అయినా ఆడండి: పాకిస్థాన్

Pakistan Hockey Federation invites Narinder Batra for World XI matches

హైదరాబాద్: పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు విముఖత చూపిస్తున్న భారత్‌ను పాకిస్థాన్ హాకీ అయినా ఆడమంటుంది. భద్రత దృష్ట్యా ఏ రకమైన ఇబ్బంది వాటిల్లదనే నమ్మకాన్ని వెల్లబుచ్చుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హాకీ సమాఖ్య అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడైన నరీందర్ బాత్రాను తమ దేశానికి ఆహ్వానించింది.

ఇప్పటికే భారత్ హాకీ జట్టుకు పాకిస్థాన్ హాకీ జట్టుకు మధ్య మ్యాచ్‌లు ఖరారైయ్యాయి. పాకిస్థాన్ హాకీ జట్టు, వరల్డ్ ఎలెవన్ జట్టుతో కరాచీ, లాహోర్‌లో ఒక్కో మ్యాచ్ ఆడనుందని, ఆ మ్యాచ్‌లకు బాత్రాను ఆహ్వానించామని తెలిపింది.

అంతేకాదు వివిధ దేశాలకు చెందిన హాకీ ఫెడరేషన్లకు కూడా ఆహ్వానాలు పంపామని చెప్పింది. భారత హాకీ దిగ్గజాలను కూడా ఆహ్వానిస్తే బంధాలు ఇంకా మెరుగుపడే అవకాశాలున్నాయనే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో భారత హాకీ దిగ్గజాలైన ధన్‌రాజ్ పిైళ్లె, పర్గత్ సింగ్‌ను కూడా ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించాలనుకుంటుంది.

ఆహ్వానాలను మన్నించి వారు రావాలంటే వీసా సమస్యలు ఉత్పన్నవమొచ్చని అనుమానం వ్యక్తపరుస్తుంది. ఈ సమస్యలు సాధ్యమైనంత వరకు ఉత్పన్నం కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తామని పాక్ హాకీ సమాఖ్య పేర్కొంది. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌ను బట్టి పాకిస్థాన్ హాకీ జట్టు ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లో 13వ ర్యాంక్‌లో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 29, 2017, 12:15 [IST]
Other articles published on Dec 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+