రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్ 2016 కోసం వెళ్లిన భారత ఆటగాళ్లకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. భారత హాకీ ఆటగాళ్లకు కేటాయించిన గదిలో కేవలం బీన్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి.
ఒలింపిక్ క్రీడా గ్రామంలో మన క్రీడాకారులకు కుర్చీలు, టీవీలు లేవు. కుర్చీలు, ఇతర సదుపాయాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. భారత హాకీ ఇండియన్ ప్రెసిడెంట్ నకింజక్ బత్రా ఇదే విషయమై భారత బృంద చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఆటగాళ్లకు సరిపడా కుర్చీలు లేవని, హాకీ పురుషుల, మహిళల జట్లకు కలిపి తొమ్మిది అపార్టుమెంటులు ఇచ్చారని, ఒక్కో దాంట్లో రెండేసి కుర్చీలు మాత్రమే ఉన్నాయని, తమకు ఇంకా 28 కుర్చీలు కావాలని, కనీసం నాలుగు టేబుళ్లు కావాలని, మిగతా జట్ల మ్యాచ్‌లను వీక్షించేందుకు టీవీలు కూడా అవసరమని, కానీ ఇక్కడ ఏవీ అందుబాటులో లేవని ఓల్ట్‌మాన్స్ లేఖలో పేర్కొన్నాడు.
అంతకుముందు హాకీ టీమ్ చీఫ్ కోచ్ రొనాల్టో ఓల్ట్‌మన్స్ ఇదే విషయమై భారత బృంద చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.