
భువనేశ్వర్: దూకుడుగా ఆడుతూ దాడి చేయడమే భారత హాకీ జట్టు బలమని కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. హాకీ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న భారత జట్టు గురువారం జరిగే క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. క్వార్టర్‌ఫైనల్లో మాత్రం ప్రత్యర్థిగా మెరుగైన హాలెండ్ జట్టు వస్తుందని భావిస్తున్నట్లు మన్‌ప్రీత్ తెలిపాడు. క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది.
'హాకీ ప్రపంచకప్ క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. క్వార్టర్స్‌లో హోరాహోరీ పోరు తప్పదు. దూకుడుగా ఆడడమే మా బలం. నాకౌట్లోనూ ఇదే జోరు కొనసాగిస్తాం. రక్షణాత్మకంగా ఆడితే ప్రత్యర్థులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది' అని మన్‌ప్రీత్ అన్నాడు.
ప్రత్యర్థి ఎవరైనా ఇకపై అన్నీ నాకౌట్ మ్యాచ్‌లే. ఓడితే ఇక ఇంటికి వెళ్లాల్సిందే. ఆటతీరులో ఎలాంటి పొరపాటు చేయకుండా మంచి అవకాశాలను వదులుకోకుండా ఆడుతాం అని మన్‌ప్రీత్ అన్నాడు. ఒకవేళ రక్షణాత్మకంగా ఆడితే ప్రత్యర్థి జట్టు దాడి చేసేందుకు అవకాశమిచ్చినట్లు అవుతుందని తెలిపాడు. అటాకింగ్ మన జట్టు బలం కావడంతో అదే వ్యూహంతో బరిలోకి దిగుతామన్నాడు.
క్వార్టర్ ఫైనల్లో హాలెండ్, బెల్జియం
హాకీ ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో 5-0తో ఘన విజయం నమోదు చేసి క్వార్టర్స్ బెర్త్ దక్కించుకుంది. మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో హాలెం డ్ జట్టు 5-0 తేడాతో కెనడాను చిత్తు చేసి భారత్‌తో క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది.