Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీ స్టిక్‌లతో పరస్పరం దాడులు: సోషల్ మీడియాలో వీడియా వైరల్

Nehru Cup Finals: Brawl Breaks Out Between Teams During Hockey Match. Watch

హైదరాబాద్: నెహ్రూ కప్ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా పంజాబ్‌ పోలీస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసాభసాగా మారింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు.

మైదానంలో ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయి ఒకరిపై మరొకరు హాకీ స్టిక్‌లతో దాడులు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడో క్వార్టర్ల్‌లో మొదలైంది.

అయితే, గొడవ ముగిసిన తర్వాత మ్యాచ్‌ను కొనసాగించగా పీఎన్‌బీ 6-3తో విజయం సాధించింది. అనంతరం నెహ్రూ కప్‌లో పాల్గొనకుండా టోర్నీ నిర్వాహకులు పోలీస్‌ జట్టుపై నాలుగేళ్లు, పీఎన్‌బీపై రెండేళ్ల నిషేధం విధించారు. ఈ గొడవపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పందించారు.

ఇరు జట్లపై హాకీ ఇండియా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. హాకీ ఇండియా సీఈఓ ఎలీనా నార్మన్ మాట్లాడుతూ "టోర్నీ అధికారుల అధికారిక నివేదక కోసం వేచి చూస్తున్నాము. దాని ఆధారంగా హాకీ ఇండియా అవసరమైన చర్యలు తీసుకుంటుంది" అని తెలిపారు.

Story first published: Tuesday, November 26, 2019, 11:51 [IST]
Other articles published on Nov 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+