ఐఓఏ అధ్యక్ష పదవికి 60 ఏళ్ల బాత్రా నామినేషన్

హైదరాబాద్: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి రీందర్ బాత్రా నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ఆయన డిసెంబర్ 14న జరిగే ఐఓఏ పాలక మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు.
తగినంత మెజారిటీ లేని కారణంగా ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రన్ మరోసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో, ఆ పదవికి బాత్రా నామినేషన్ దాఖలు చేశాడు. అతని నామినేషన్‌ను ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా ప్రతిపాదించగా, కోశాధికారి అనిల్ ఖన్నా మద్దతునిచ్చాడు.
దీనికి ముందు జాగ్రత్తగా ఉపాధ్యక్ష పదవికి కూడా మూడు సెట్ల నామినేషన్లను బాత్రా సమర్పించడం విశేషం. భారత ఒలింపిక్ సంఘంలోని వివిధ పదవులకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీని మంగళవారం (నవంబర్ 28)గా నిర్ణయించారు.
మధ్యాహ్నాం 2 గంటలలోపు అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖల చేయొచ్చు. 60 ఏళ్ల బాత్రా 2012 నుంచి 2014 వరకు ఐఓఏ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. అయితే, ఫిబ్రవరి 2014లో ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో మాత్రం బాత్రాకు చోటు దక్కలేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications