Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి చివరిచూపుకు కూడా వెళ్లకుండా దేశం కోసం పోరాడింది

Mizo hockey player Lalremsiami misses father’s funeral but wins final with Team India

కన్నతండ్రి మరణవార్త తెలిసినా గుండె నిబ్బరం చేసుకుని తన దేశం కోసం ఆడింది భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. తండ్రి చివరిచూపునకు కూడా వెళ్లకుండా జట్టు కోసం పోరాడింది. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్‌రెమ్సియామీ భారత హాకీ మహిళల జట్టు క్రీడాకారిణి. గత ఆదివారం హిరోషిమాలో హాకీ ఎఫ్‌ఐహెచ్‌ సిరిస్‌ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌తో భారత్ తలపడింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే ఫైనల్‌ మ్యాచ్‌ జరగడానికి రెండు రోజుల ముందు లాల్‌రెమ్సియామీ తండ్రి లాల్‌తన్సంగా జోత్‌ గుండె పోటుతో మృతిచెందారు. ఈ విషయం లాల్‌రెమ్సియామీకి తెలిసినా.. ఫైనల్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని తండ్రి చివరిచూపు చూసేందుకు కూడా స్వదేశానికి తిరిగి రాలేదు. 'నీ తండ్రి గర్వపడాలంటే ఇక్కడే ఉండి టోర్నీలో ఆడాలి' అని ఆమె కోచ్‌కు చెప్పడంతో బాధను దిగమింగుకుని బరిలోకి దిగింది.

భారత్ ఫైనల్లో జపాన్‌పై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. లాల్‌రెమ్సియామీ త్యాగానికి గుర్తుగా ఫైనల్‌ విజయాన్ని ఆమె తండ్రికి కెప్టెన్‌ రాణి రాంపాల్‌ అంకితం చేసింది. ఇక మ్యాచ్ అనంతరం లాల్‌రెమ్సియామీ మంగళవారం తన స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. భారత్ ఫైనల్‌కు చేరి 2020 ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించింది. తండ్రి మరణవార్త విన్నా.. దేశం కోసం ఆడిన లాల్‌రెమ్సియామీ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Story first published: Wednesday, June 26, 2019, 13:35 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+