FIH Player of the Year అవార్డు రేసులో మన్‌ప్రీత్ సింగ్

హైదరాబాద్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రతి ఏటా ఇచ్చే వార్షిక అవార్డుల్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులను నామినేట్ అయ్యారు. భారత సీనియర్ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు నామినేట్ కాగా... వివేక్ ప్రసాద్, లాల్‌రెమ్‌సియామి వరుసగా పురుషుల, మహిళల 'రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్' అవార్డు బరిలో ఉన్నారు.
27 ఏళ్ల మన్‌ప్రీత్ భారత్ తరఫున 242 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయిర్స్‌లో రష్యాపై భారత్ 11-3 తేడాతో గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో మన్‌ప్రీత్ సింగ్‌దే కీలకపాత్ర. 19 ఏళ్ల వివేక్ ప్రసాద్ గత ఏడాది యూత్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.
అలాగే ఆసియా క్రీడల్లో భారత జట్టు రజతం నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించిన లాల్‌రెమ్‌సియామి 'మహిళా రైజింగ్ స్టార్ అఫ్ ది ఇయర్ (అండర్-23)' అవార్డుకు నామినేట్ అయింది. నామినేట్ అయిన వారిలో అత్యధిక ఓటింగ్ సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ హాకీ సమాఖ్య విజేతలుగా ప్రకటిస్తుంది.
ఈ ఓటింగ్‌లో జాతీయ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు, హాకీ జర్నలిస్టులు పాల్గొనవచ్చు. ఓటింగ్ వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో విజేతలను ప్రకటిస్తారు. కాగా, ఎఫ్‌ఐహెచ్ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు నామినేట్ అయిన తనకు మద్దతుగా ఓటింగ్ చేసి గెలిపించాలని ట్విటర్ వేదికగా మన్‌ప్రీత్ సింగ్ అభ్యర్థించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications