Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాకీ వరల్డ్ కప్‌: చివరి వరకు ఉత్కంఠ, కష్టంగా నెగ్గిన అర్జెంటీనా

Mens Hockey World Cup 2018: Argentina beat Spain 4-3 in a goalfest

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా శుభారంభం చేసింది. పూల్‌-ఎలో గురువారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 4-3తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చివరి నిమిషం వరకూ పోరాడిన స్పెయిన్‌, రెండో ర్యాంకులో ఉన్న అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది.

అర్జెంటీనా తరఫున మాజిల్లీ(4వ నిమిషం,15వ), పెల్లట్(15 నిమి షం,49వ) నిమిషంలో రెండేసి గోల్స్ చేయగా.. స్పెయిన్ తరఫున ఎన్‌రిక్ గొంజాలెజ్(3వ), జోసెఫ్ రోమె(14వ), విక్సెన్స్ రూయిజ్(35)వ నిమిషంలో గోల్స్ చేశారు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో ఉన్న అర్జెంటీనా ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. స్పెయిన్ అద్భుత ప్రదర్శన చేసింది.

 మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే గోల్

మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే గోల్

మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే అర్జెంటీనా గోల్‌కీపర్ జువాన్ వివాల్దిని బోల్తా కొట్టిస్తూ స్పెయిన్ యువ స్ట్రైకర్ గొంజాలెజ్ అద్భుతమైన ఫీల్డ్‌గోల్‌తో షాకిచ్చాడు. ఆ తర్వాత అర్జెంటీనా ఆటగాడు మాజిల్లీ గోల్‌ కొట్టి స్కోరు సమం అయింది. దీంతో మళ్లీ రెండు జట్లూ గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి.

 14వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీకార్నర్

14వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీకార్నర్

మ్యాచ్ 14వ నిమిషంలో స్పెయిన్‌కు పెనాల్టీకార్నర్ లభించగా.. జోసెఫ్ రోమె ఎలాంటి తడబాటు లేకుండా గోల్ చేయడంతో స్పెయిన్‌కు మరోసారి ఆధిక్యం దక్కింది. అయితే, 15వ నిమిషంలోనే మాజిల్లీ మరోసారి మ్యాజిక్ చేశాడు. లూకాస్ విల్లా అందించిన పాస్‌ను మాజిల్లీ ప్రత్యర్ధి గోల్‌ పోస్టులోకి పంపాడు.

రెండో క్వార్టర్‌లో అర్జెంటీనా తొలి పెనాల్టీని సాధించగా

రెండో క్వార్టర్‌లో అర్జెంటీనా తొలి పెనాల్టీని సాధించగా

దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి రెండు జట్లూ 2-2 గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఇక, రెండో క్వార్టర్‌లో అర్జెంటీనా తొలి పెనాల్టీని సాధించగా.. డ్రాగ్ ఫ్లికర్ పెల్లట్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్‌పోస్టులోకి తరలించడంతో మ్యాచ్‌లో తొలిసారిగా అర్జంటీనా జట్టు 3-2 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

డిసెంబర్ 3న న్యూజిలాండ్‌తో తలపడనున్న అర్జెంటీనా

డిసెంబర్ 3న న్యూజిలాండ్‌తో తలపడనున్న అర్జెంటీనా

మ్యాచ్ 35వ నిమిషంలో రూయిజ్ తనదైన స్టైల్‌తో ఫీల్డ్‌ గోల్ సాధించడంతో మ్యాచ్ 3-3 స్కోరుతో సమం అయింది. దీంతో చివర్లో ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. మ్యాచ్ 49వ నిమషంలో లభించిన మరో పెనాల్టీకార్నర్‌ను పెల్లట్ గోల్‌గా మలిచి అర్జెంటీనాకు విజయాన్ని అందించాడు. డిసెంబర్ 3న తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనా న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Story first published: Friday, November 30, 2018, 12:17 [IST]
Other articles published on Nov 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+