కెప్టెన్‌గా మన్‌ప్రీత్: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత హాకీ జట్టు ఎంపిక

హైదరాబాద్: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టుకు పీఆర్ శ్రీజేష్ స్థానంలో మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ నెలలో మస్కట్ వేదికగా జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించిన హాకీ ఇండియా గోల్‌కీపర్ శ్రీజేష్ స్థానంలో మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
సీనియర్ గోల్ కీపర్ శ్రీజేష్ కెప్టెన్సీ కోల్పోయినా జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్‌కు చింగ్లెన్‌సనసింగ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శ్రీజేష్‌తో పాటు యువ గోల్‌కీపర్ కృష్ణ బహుదూర్ పాఠక్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. సర్దార్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత టీమ్‌ఇండియా ఆడుతున్న తొలి మేజర్ టోర్నీ కావడంతో అందరి దృష్టి నెలకొంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా టీమిండియా
భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీ బరిలో దిగనుంది. డిఫెండర్ కొతాజిత్ సింగ్ మళ్లీ చోటు దక్కించుకోగా, 20 ఏళ్ల హార్దిక్ సింగ్ సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఫార్వర్డ్స్ ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, గుర్జంత్ సింగ్ తదితరులు ఎంపికయ్యారు. అక్టోబర్ 18 నుంచి 28 వరకు మస్కట్‌లో ఈ టోర్నీ జరగనుంది.

కొంత మంది ఆటగాళ్లకు ఇదే చివరి టోర్నీ
ఈ సందర్భంగా కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో జట్టు సమతూకంగా ఉందని అన్నాడు. కొంత మంది ఆటగాళ్లకు ఇదే చివరి టోర్నీ అని చెప్పాడు. భువనేశ్వర్‌లో జరుగనున్న వరల్డ్‌కప్‌లో కొత్త జట్టుతో బరిలోకి దిగుతామని చెప్పాడు. భువనేశ్వర్‌లో మూడు వారాల శిక్షణ శిబిరం తర్వాత టీమిండియా మస్కట్ బయలుదేరి వెళ్లనుంది.

రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు
2016 టోర్నీ ఫైనల్లో భారత్ 3-2తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలిచి.. టైటిల్ సాధించింది. ఈసారి భారత్‌తో పాటు ఆతిథ్య ఒమన్, మలేసియా, పాక్, దక్షిణ కొరియా, జపాన్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి.

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత హాకీ జట్టు
గోల్‌కీపర్లు: శ్రీజేష్, కృష్ణ బహుదూర్ పాఠక్.
డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్, గురిందర్ సింగ్, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, జర్మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్.
మిడ్‌ఫీల్డర్లు: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), సుమిత్ నీలకంఠ, లలిల్ కుమార్, చింగ్లెన్‌సనా సింగ్.
స్ట్రెకర్స్: అక్షదీప్ సింగ్, గుర్జాంత్ సింగ్, మన్‌దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications