For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bharat Ratna: హాకీ లెజెండ్‌కు అత్యున్నత పౌర పురస్కారం: దానికి రాజీవ్ పేరు తొలగించాలి!

Major Dhyan Chand must be felicitated with Bharat Ratna: Netizens demand

టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌‌లో పదవ రోజు.. భారత క్రీడా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతిష్ఠాత్మక ఈ ఈవెంట్‌లో బ్యాక్ అండ్ బ్యాక్ విక్టరీలను నమోదు చేసింది. గంట వ్యవధిలోనే రెండు ఘన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు దుమ్ము దులిపారు. చైనా అడ్డుగోడను అధిగమించారు. కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆ వెంటనే పురుషుల హాకీ జట్టు మరో చరిత్రను సృష్టించింది. నాలుగు దశాబ్దాల తరువాత సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

సెమీ ఫైనల్‌లో హాకీ ఇండియా..

ఆదివారం సాయంత్రం జరిగిన క్వార్ట‌ర్‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో హాకీ ఇండియా 3-1 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిట‌న్‌పై అద్భుత విజ‌యం సాధించింది. ఒలింపిక్స్‌లో ఒక‌ప్పుడు బంగారు పతకాల పంటను పడించింది భారత హాకీ జట్టు. ఎనిమిది గోల్డ్ మెడ‌ల్స్ సాధించింది. ఆ తరువాత సత్తా చాటలేకపోయింది. క‌ళ త‌ప్పింది. ఈ సారి అద్భుత‌మే చేసింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంది. టోర్నీ మొత్తం మీద నిల‌క‌డ‌గా రాణిస్తున్న మ‌న్‌ప్రీత్ సింగ్ టీమ్.. లీగ్ దశలో అయిదు మ్యాచ్‌ల‌కు నాలుగింట్లో విజయాలు అందుకుంది. క్వార్టర్ ఫైనల్స్ గండాన్ని కూడా దాటుకుంది.

ధ్యాన్ చంద్ హవా..

ఒలింపిక్స్‌లో భారత హాకీ హవా నడవడానికి ప్రధాన కారకుడు మేజర్ ధ్యాన్ చంద్. హాకీ జట్టును అత్యున్నతంగా తీర్చిదిద్దారు. నాలుగు దశాబ్దాల కిందటే ఒలింపిక్స్‌లో పతకాలను కొల్లగొట్టిందంటే- జట్టు సామర్థ్యం, వ్యూహాలు ఎంత పక్కాగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అన్నింటికీ మించి- దేశానికి పేరు ప్రతిష్ఠలను తీసుకుని రావాలనే తపన ఉండేది అప్పటి ప్లేయర్లలో. అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ.. హాకీలో సత్తా చాటారు. అందుకే- ధ్యాన్ చంద్‌ను భారత హాకీ పితామహుడిగా భావిస్తారు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం.. భారత రత్నను ఇచ్చి గౌరవించుకోవాలనే డిమాండ్ చాలాకాలం నుంచీ వినిపిస్తోంది.

తొలి క్రీడాకారుడిగా.. సచిన్ టెండుల్కర్‌

క్రీడారంగానికి భారతరత్న పురస్కారాన్ని వర్తింపజేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తరువాత దీన్ని సవరించింది.. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న అవార్డును అందజేసింది. ఇది- ధ్యాన్ చంద్‌కు కూడా ఆ పౌర పురస్కారాన్ని ఇవ్వాలనే డిమాండ్‌కు మళ్లీ జీవం పోసినట్టయింది. ఇప్పుడు మళ్లీ- అది ఊపందుకుంటోంది. దీనికి కారణం- భారత హాకీ జట్టే. టోక్యో ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని హాకీ జట్టు ఒలింపిక్స్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన నేపథ్యంలో నెటిజన్లు.. ధ్యాన్‌చంద్‌కు భారతరత్న డిమాండ్‌ను వినిపిస్తోన్నారు.

కనీసం ఇప్పుడైనా..

మరణానంతరం ధ్యాన్ చంద్‌కు భారతరత్న అవార్డును అందజేయడానికి ఇంతకంటే మంచి సమయం రాదని నెటిజన్లు అభిప్రాయపడుతోన్నారు. హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించిందంటే.. దానికి ఆద్యుడు ధ్యాన్ చందేనని చెబుతున్నారు. అలాంటి అత్యున్నత హాకీ ప్లేయర్‌కు భారత రత్న అవార్డును అందజేయడమంటే దేశ ప్రజలు తమను తాము గౌరవించుకున్నట్టే అవుతుందని అంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాము డిమాండ్ చేస్తోన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, కనీసం ఇప్పుడైన ఆ హాకీ లెజెండ్‌ను గౌరవించుకోవాలని సూచిస్తోన్నారు.

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరు మార్చాలంటూ..

క్రీడా రంగానికి సంబంధించినంత వరకు అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పేరును మార్చాలని, దాన్ని భారత్ ఖేల్ రత్న అవార్డుగా రీనేమ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు కొందరు నెటిజన్లు. దేశంలోని అన్ని స్టేడియాలకు క్రీడాకారుల పేర్లను మాత్రమే పెట్టాలని సూచిస్తోన్నారు. క్రీడలతో ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, కేంద్రమంత్రుల పేర్లను పెట్టడం సరికాదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో క్రీడారంగాన్ని తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని, గ్రామాల్లో ఎందరో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఆదరణకు నోచుకోవట్లేదని అంటున్నారు.

గ్రూప్ దశలో

అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకునే అవకాశమే రాలేదు భారత హాకీ ప్లేయర్లకు. వరుస విజయాలను అందుకుంటూ వచ్చారు. మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌ను వణికించిన హాకీ ఆటగాళ్లు.. అర్జెంటీనాపై తడాఖా చూపారు. 3-1 గోల్స్ తేడాతో మట్టి కరిపించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ తన రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గ్రూప్ దశలో మొత్తం అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలను సొంతం చేసుకుందిన హాకీ ఇండియా. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఓడించింది. 3-2 గోల్స్ తేడాతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఘోరంగా ఓటమి పాలైంది. 1-7 గోల్స్ తేడాతో దారుణ పరాజయాన్ని చవి చూసింది.

హాకీ ప్రస్థానం ఇదీ..

మూడో మ్యాచ్‌‌లో స్పెయిన్‌‌ను 3-0 తేడాతో ఓడించింది. ఆ తరువాతి మ్యాచ్‌లో అర్జెంటీనాపై 3-1 గోల్స్ తేడాతో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయిదో మ్యాచ్‌లో జపాన్ హాకీ జట్టును వారి సొంత గడ్డ మీదే ఓడించింది. తిరుగులేని విజయాన్ని సాధించింది. లోకల్ బోయ్స్‌ను 5-3 తేడాతో మట్టి కరిపించింది హాకీ ఇండియా. దర్జాగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ తన తదుపరి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీ కొట్టబోతోంది. ఇదో హైఓల్టేజ్ మ్యాచ్‌గా మారడం ఖాయం. గెలిస్తే పతకం ఖాయమయ్యే దశకు చేరుకుంటుంది భారత హాకీ జట్టు.

దర్జాగా సెమీస్‌లోకి..

భారత్ త‌ర‌ఫున దిల్‌ప్రీత్ సింగ్‌, హార్దిక్ సింగ్‌, గుర్జిత్ సింగ్ తలో గోల్స్ చేశారు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది. మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేయగా.. రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్‌సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌ విరామ సమయానికి భారత్‌ 2-0 పాయింట్ల ఆధిక్యంతో కొనసాగింది. 45వ నిమిషంలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసింది. దీంతో మూడో క్వార్టర్‌ పూర్తయ్యేసరికి బ్రిటన్‌ ఒక గోల్‌ చేసి స్కోర్‌ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ మూడో గోల్‌ చేసి భారత్‌ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. ఫలితంగా భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

Story first published: Monday, August 2, 2021, 10:00 [IST]
Other articles published on Aug 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+