న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొరియాతో భారత్ సిరీస్‌.. తెలుగమ్మాయికి చోటు

Korea tour: Rani Rampal to lead 18-member Indian women’s hockey team, Rajani Etimarpu get chance

కొరియాతో మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో తలపడే 18 మందితో కూడిన భారత జట్టును శుక్రవారం హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. మే 20న నుండి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. భారత మహిళల హాకీ జట్టుకు స్ట్రెకర్ రాణి రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గోల్‌కీపర్ సవిత వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తెలుగమ్మాయికి చోటు

తెలుగమ్మాయికి చోటు

తెలుగమ్మాయి యతిమరుపు రజనీ కూడా ఈ సిరీస్‌కు ఎంపికైంది. సవితతో పాటు రజనీ గోల్‌కీపర్ బాధ్యతలు నిర్వర్తించనుంది. గాయం కారణంగా మలేసియా పర్యటనకు దూరమైన డిఫెండర్ గుర్జిత్‌కౌర్ తిరిగి జట్టులోకి వచ్చింది. వందనా కటారియా, లాల్‌రెమిసియామి, జ్యోతి, నవ్‌నీత్‌ కౌర్‌లతో ఫార్వర్డ్ బలంగా ఉంది. మోనికా, నవ్‌జ్యోత్‌ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమామింజ్‌లతో డిఫెన్స్ పటిష్ఠంగా ఉంది.

భారీ అంచనాలు:

ఈ సిరీస్‌లో భారత్‌ మే 20, 22, 24 తేదీల్లో మ్యాచులు ఆడనుంది. జూన్‌ 15న జపాన్‌లో ప్రారంభమయ్యే ఎఫ్‌ఐహెచ్‌ మహిళల సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీకి ముందు కొరియా సిరీస్‌ భారత్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈ ఏడాదిలో భారత మహిళల జట్టు స్పెయిన్, ఐర్లాండ్, మలేసియాలలో పర్యటించింది. మూడు సిరీస్‌లలో కూడా భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. దీంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జట్టు:

జట్టు:

సవిత, ఇతిమరపు రజని, రాణి రాంపాల్‌ (కెప్టెన్‌), సలీమా, సునీత లాక్రా, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, కరిష్మా యాదవ్, గుర్జీత్‌ కౌర్, సుశీలా చాను, మోనిక, నవ్‌జ్యోత్‌ కౌర్, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, లిలిమా మిన్జ్, వందన కటారియా, లాల్‌రెమ్‌సియామి, జ్యోతి, నవనీత్‌ కౌర్‌.

Story first published: Saturday, May 11, 2019, 10:37 [IST]
Other articles published on May 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X