For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 ఏళ్ల నిరీక్షణకు తెర: చరిత్ర సృష్టించిన భారత్

ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను చిత్తుచేసి రెండోసారి ఈ టైటిల్‌ను గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత హాకీకి మళ్లీ స్వర్ణయుగం మొదలైందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఒకటిన్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సీనియర్ విభాగంలో పురుషులు, మహిళల జట్లు ఆసియా టైటిళ్లు సాధించి జైత్రయాత్రకు శ్రీకారం చుడితే జూనియర్ కేటగిరీలో యువ భారత్ ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచింది.

హరేంద్ర సింగ్ శిక్షణలో రాటుదేలిన భారత జూనియర్ హాకీ జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. తద్వారా పదిహేనేళ్ల తర్వాత జూనియర్ ప్రపంచ కప్‌ను యువ భారత్ ఒడిసిపట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను చిత్తుచేసి రెండోసారి ఈ టైటిల్‌ను గెల్చుకుని చరిత్ర సృష్టించింది.

15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై విజయం

15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై విజయం

జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటికి మూడుసార్లు భారత కుర్రాళ్లు ఫైనల్ చేరారు. 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు 2001లో ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై జరిగిన టోర్నీలో విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ కప్ గెలిచిన తొలి ఆతిథ్య జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

చరిత్ర సృష్టించిన భారత్

చరిత్ర సృష్టించిన భారత్

అంతేకాదు జర్మనీ తర్వాత రెండుసార్లు ప్రపంచకప్ అందుకొన్న జట్టుగా కూడా భారత్ చరిత్ర సృష్టించింది. 2001లో గగన్ అజిత్ సింగ్, యుగ్రాజ్ సింగ్ అసాధారణ ప్రతిభతో భారత్‌కు టైటిల్ దక్కితే, ఈసారి సమష్టి కృషితో భారత జూనియర్ హాకీ జట్టు జయకేతనం ఎగురవేసింది.

భారత్ విజయానికి కారణం

భారత్ విజయానికి కారణం

ఐదు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న జర్మనీ, అత్యంత బలమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకోలేకపోవడంతో, భారత్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. బెల్జియంపై ఫేవరిట్‌గా బరిలోకి దిగిన హర్జీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ మొదటి నుంచి చివరి వరకూ వ్యూహాత్మకంగా ఆడింది.

ఆరంభం నుంచే దూకుడుగా

ఆరంభం నుంచే దూకుడుగా

ఆరంభంలో ప్రత్యర్థిపై ముమ్మర దాడులు చేసింది. ఆరు నిమిషాలలోపే రెండు పెనాల్టీ కార్నర్లు సాధించినా గోల్స్ సాధించడంలో భారత్ విఫలమైంది. అయితే, పదునైన దాడులతో హడలెత్తించిన భారత్ దూకుడుకు ఆట 8వ నిమిషంలో ఫలితం దక్కింది. భారత ఆటగాడు సుమిత్ కొట్టిన షాట్‌ను బెల్జియం గోల్‌కీపర్ వాన్‌డోరెన్ అడ్డుకున్నాడు.

22వ నిమిషంలో రెండో గోల్

22వ నిమిషంలో రెండో గోల్

దీంతో బంతి అతనికి తగిలి వెనక్కు రాగా అక్కడే పొంచి ఉన్న గుర్జాంత్ ఒడుపుగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మళ్లీ 22వ నిమిషంలో నీలకంఠ అందించిన పాస్‌ను సిమ్రన్ జీత్ సింగ్ గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది. రెండు గోల్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత రక్షణ విధానాన్ని అనుసరించింది.

ఒత్తిడిలో పడిన బెల్జియం

ఒత్తిడిలో పడిన బెల్జియం

దీంతో బెల్జియం ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత బెల్జియం ఆటగాడు ఫ్యాబ్రిక్ వాన్ 70వ నిమిషంలోగోల్ చేసినా ఫలితం లేకపోయింది. గోల్స్ కోసం బెల్జియం చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. ఆ తర్వాత బెల్జియం ఆటగాడు ఫ్యాబ్రిక్ వాన్ 70వ నిమిషంలోగోల్ చేసినా ఫలితం లేకపోయింది. భారత్ చివరివరకు 2-1 ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడంతో బెల్జియంకు నిరాశ తప్పలేదు.

గుర్జాంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

గుర్జాంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన గుర్జాంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. స్పెయిన్ ఆటగాడు ఎన్రిక్ గొంజాలెజ్ మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

రూ. 3 లక్షల నజరానా

రూ. 3 లక్షల నజరానా

జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ గెలిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఒక్కో క్రీడాకారుడికి రూ.3లక్షల చొప్పున నజరానా ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. ఆదివారం జరిగిన తుది పోరులో 2-1తో బెల్జియంపై భారత్‌ గెలుపొంది జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

జర్మనీకి కాంస్యం

జర్మనీకి కాంస్యం

ఆరుసార్లు చాంపియన్ జర్మనీ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్‌కు ముందు రోజు మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 3-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి కాంస్య పతకాన్ని అందుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+