సెమీస్‌లో షూటౌట్: ఆసీస్‌పై విజయం, ఫైనల్లో భారత్
హైదరాబాద్: సొంతగడ్డపై భారత ఆటగాళ్లు సత్తా చాటారు. జూనియర్ హాకీ ప్రపంచక్‌పలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియాపై షూటౌట్‌లో 4-2తో విజయం సాధించారు.
ఈ టోర్నీలో అత్యంత పటిష్టమైన జట్టుగా, హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, గతంలో ఆరు పర్యాయాలు ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న జర్మనీ జట్లు అనూహ్యంగా ఓటమి పాలయ్యాయి. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్‌లోనూ పెనాల్టీ షూటౌట్ అనివార్యం కావడం గమనార్హం.
భారత్ చివరిసారి 2001లో జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించింది. 2013లో స్వదేశంలోనే జరిగిన ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఈ తాజా విజయంతో 15 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరుకున్నట్లయింది. దీంతో ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడనుంది.
అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆరుసార్లు చాంపియన్ జర్మనీకి షాకిచ్చిన బెల్జియం తొలిసారిగా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. తొలుత నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో షూటౌట్‌లో బెల్జియం 4-3తో జర్మనీపై గెలుపొందింది.

ఆస్ట్రేలియాతో పోరు హోరాహోరీ
శుక్రవారం మ్యాచ్ ప్రారంభం నుంచే ఆస్ట్రేలియాతో పోరు హోరాహోరీగా సాగింది. మైదానంలో అత్యంత వేగంగా కదులుతూ, ప్రత్యర్థి జట్లపై ముమ్మర దాడులు చేయడంలో పేరుపొందిన ఆస్ట్రేలియాకు 14వ నిమిషంలో టామ్ క్రెగ్ గోల్‌ను అందించాడు. దీంతో కంగుతిన్న భారత ఆటగాళ్లు ఒకవైపు రక్షణ విభాగాన్ని పటిష్టం చేసుకుంటూనే, మరోవైపు ధాటిగా ఆడారు. ఆసీస్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా యువ ఆటగాళ్లు జోరును కొనసాగించారు.

42వ నిమిషంలో గుజ్రంత్ సింగ్ గోల్
42వ నిమిషంలో గుజ్రంత్ సింగ్ ద్వారా భారత్‌కు ఊరట లభించింది. దీంతో స్కోరు సమం కావడంతో భారత ఆటగాళ్లు త్సాహం రెట్టింపుకాగా, ఆసీస్‌పై భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మరో ఆరు నిమిషాల్లోనే మన్దీప్ సింగ్ గోల్ సాధించి, భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. రెండో గోల్ లభించిన తర్వాత, హర్జీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి వ్యూహాత్మక డిఫెన్స్‌కు దిగింది. కానీ, లాచ్లన్ షార్ప్ ఈ రక్షణ వలయాన్ని ఛేదించి, 57వ నిమిషంలో గోల్‌ను సాధించాడు.

2-2తో సమం
దీంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవడంతో షూటౌట్ అనివార్యమైంది. భారత్ తరఫున గుర్జాంత్‌సింగ్ (42వ నిమిషం), మన్‌దీప్ సింగ్ (48వ) గోల్స్ చేశారు. ఆసే్ట్రలియా తరఫున టామ్ క్రెగ్ (14వ), లచ్లాన్ షార్ప్ (57వ) గోల్స్ సాధించారు. షూటౌట్‌లో హర్జీత్, హర్మన్‌ప్రీత్, సుమిత్, మన్‌ప్రీత్ గోల్స్ చేశారు.

ఉత్కంఠగా షూటౌట్
షూటౌట్‌లో తొలుత ఆసీస్ ప్లేయర్ గోవర్స్ షాట్‌ను భారత డిఫెండర్ వికాస్ అడ్డుకోలేకపోయాడు. దీంతో ప్రత్యర్థి 1-0తో నిలిచింది. అనంతరం భారత్ తరఫున హర్జీత్ సింగ్ గోల్ చేశాడు. అతను చాకచక్యంగా కొట్టిన బంతిని ఆస్ట్రేలియా గోల్‌కీపర్ థామస్ ఆష్లే అడ్డుకోలేకపోయాడు. దీంతో భారత్ 1-1తో సమం చేసింది.

ఊపిరిపీల్చుకున్న భారత్
ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ బర్డ్ కొట్టిన షాట్‌ను వికాస్ అడ్డుకోవడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. ఆ వెంటనే హర్మన్‌ప్రీత్ సింగ్ తన చాన్స్‌ను సద్వినియోగం చేసుకొని, భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. లాచ్లన్ షార్ప్ కొట్టిన బంతిని వికాస్ అద్భుతంగా ఆడ్డుకోవడంతో, ఆస్ట్రేలియా విజయావకాశాలకు దాదాపుగా తెరపడింది.

ఆధిక్యంలోకి భారత్
ఆ తర్వాత వెంటనే సుమీత్ కొట్టిన బంతి ఆసీస్ గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది. భారత్‌కు 3-1 ఆధిక్యం లభించింది. వెల్చ్ జాక్ చక్కటి స్ట్రయిక్‌తో గోల్ చేసి, ఆస్ట్రేలియాకు రెండో గోల్‌ను అందించాడు. ఆఖరి అవకాశంలో మన్‌ప్రీత్ కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్‌పోస్టలోకి దూసుకెళ్లడంతో భారత్ విజయం ఖాయమైంది. భారత్ తరఫున పెనాల్టీ షూటౌట్‌ను తీసుకున్న నలుగురు ఆటగాళ్లు సఫలంకాగా, ఆసీస్ తరఫున నలుగురిలో ఇద్దరు మాత్రమే గోల్స్ చేయగలిగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications