For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth Games: హాకీని తిరిగి తీసుకురండి: జర్మన్‌ప్రీత్ సింగ్

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి హాకీని తొలగించడంపై టీమిండియా డిఫెండర్ జర్మన్‌ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయం తమకు నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు. మైఖేల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గ్లాస్గో గేమ్స్ నుంచి హాకీతో పాటు రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్క్వాష్, షూటింగ్, నెట్‌బాల్, రోడ్ రేసింగ్‌ను తొలగిస్తున్నట్లు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండేళ్ల క్రితం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022లో ఈ క్రీడలన్నీ ఉన్నాయి. మొత్తం 19 క్రీడాంశాల్లో అథ్లెట్లు పోటీపడ్డారు. అయితే ఈ సారి ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా తొమ్మిది క్రీడాంశాలను తొలగించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య నిర్ణయించింది. ఈ నిర్ణయం భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ. భారత్‌కు పతకావశాలు అధికంగా ఉండే క్రీడలనే సమాఖ్య తొలగించింది. ఇది మన పతకాల సంఖ్య‌ను గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Jarmanpreet Singh Calls Hockey s Exclusion from 2026 Commonwealth Games a Big Shock

''కామన్వెల్త్ గేమ్స్ నుంచి హాకీని తొలగించడం మమ్మల్ని తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఈ మెగాటోర్నీలో పాల్గొనాలని మా ఆటగాళ్లంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. దీనిపై నిర్వాహకులు పునరాలోచన చేయాలి. కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని తీసుకురావాలి'' అని జర్మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు.

2022 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి. ఇందులో రెజ్లింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు, వెయిట్ లిఫ్టింగ్‌లో 10 మెడల్స్ వచ్చాయి. కామన్వెల్త్ దేశాల మధ్య ఒలింపిక్స్ తరహాలో ప్రతీ నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ క్రీడల ఈ సారి స్కాంట్లాండ్‌లో గ్లాస్గో వేదికగా జరగనున్నాయి. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు ఈ టోర్నీ జరగనుంది.

కాగా, భారత హాకీ జట్టు ఇవాళ నుంచి రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా జర్మనీని ఢీకొననుంది. ఈ సిరీస్‌కు ఢిల్లీ వేదిక కానుంది. దశాబ్దం తర్వాత అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌ ఢిల్లీలో జరగనుండటం విశేషం. పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో భారత్ జర్మనీ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, October 23, 2024, 12:07 [IST]
Other articles published on Oct 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+