For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాక్ ను చిత్తు చేసేశారు.. సెమీస్ లో ఇండియన్ హాకి విక్టరీ

న్యూఢిల్లీ : ఓవైపు దేశ సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులను మట్టుబెడుతుంటే.. మరోవైపు మైదానంలో పాక్ జట్టును చిత్తు చేసింది ఇండియన్ అండర్-18 హాకి టీమ్. దాయాదుల మధ్య సరిహద్దు వాతారణం రణరంగాన్ని తలపిస్తుండడంతో.. మైదానంలో రెండు జట్ల పోరు మరింత ఉత్కంఠ రేకెత్తించింది.

కాగా, ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా.. గురువారం నాడు ఢాకా వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 3-1తేడాతో పాక్ ను కంగు తినిపించింది ఇండియన్ హాకీ టీమ్. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే శివం ఆనంద్ గోల్ చేయడంతో జట్టుకు శుభారంభం లభించింది. ఆ తర్వాత దిల్ ప్రీత్ సింగ్ మరో గోల్ చేయడం.. మ్యాచ్ ద్వితీయార్థంలో సంజీప్ మూడో గోల్ సాధించడంతో ఇండియా మెరుగైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయితే ఆఖర్లో పాక్ తరుపున అలీఖాన్ గోల్ చేయడంతో.. భారత్ అధిక్యం 3-1 కు తగ్గింది. ఏదేమైనా పాక్ పై భారత్ విజయం ప్రస్తుతం దేశాభిమానుల్లో ఆనందం నింపుతోంది.మరో మ్యాచ్ లో తైపీ పై 5-1తేడాతో బంగ్లా విజయం సాధించడంతో.. తదుపరి మ్యాచ్ లో ఇండియన్ హాకి టీమ్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+