
పెనాల్టీ షూటౌట్ తో 10వ సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్‌ను భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు గెలుచుకుంది. మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో జట్లు 1-1తో సమంగా నిలిచాయి, ఆ తర్వాత విజేతను నిర్ణయించేందుకు తొమ్మిది పెనాల్టీ షూటౌట్లు ఆడాల్సి వచ్చింది.
భారత కెప్టెన్ ఉత్తమ్ సింగ్, బాబీ సింగ్ ధామి గోల్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలను ఆస్ట్రేలియా అడ్డుకుంది. సుదీప్ చిర్మాకో (14వ నిమిషం) గోల్ చేసి భారత్ ను 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 29వ నిమిషంలో ఆసీస్ ఆటగాడు జాక్ హాలండ్ గోల్ చేశాడు. దీంతో భారత్, ఆస్ట్రేలియా స్కోరు 1-1కి చేరాయి. ఆ తర్వాత ఇట్లు మ్యాచ్ ముగిసే వరకు గోల్ చేయలేదు. పెనాల్టీ షూటౌట్లు ఆడాల్సి వచ్చింది.
పెనాల్టీ షూటౌట్లులో భారత్ పై చేయి సాధించి మ్యాచ్ తో పాటు సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్‌ను కూడా గెలుచుకుంది. ఉత్తమ్‌సింగ్ షూటౌట్‌తో పాటు సడెన్ డెత్‌లోనూ గోల్స్ చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విష్ణుకాంత్ సింగ్, అంకిత్‌పాల్, సుదీప్ చిర్మాకో షూటౌట్‌లో గోల్స్ సాధించారు. ఇండియా గతంలో రెండుసార్లు 2013, 2014లో ఈ ట్రోఫీ నెగ్గింది.