Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్లో ఒత్తిడిని జయించి ఛాంపియన్‌గా నిలిచిన భారత్

హైదరాబాద్: భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటారు. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌ 5-4తేడాతో చైనాను ఓడించింది.

 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్

1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్

షూటౌట్‌లో గోల్‌కీపర్‌ సవిత అద్భుత ప్రదర్శనతో భారత్‌ను విజేతగా నిలబెట్టింది. నవ్‌జ్యోత్‌ కౌర్‌ (25వ ని) గోల్‌ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తియాన్‌తియాన్‌ లువో (47వ ని)లో గోల్‌ చేయడంతో చైనా 1-1తో స్కోరు సమం చేసింది. మ్యాచ్‌ ముగిసే సరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌‌కు దారి తీసింది.

 4-4తో సమంగా నిలిచిన రెండు జట్లు

4-4తో సమంగా నిలిచిన రెండు జట్లు

ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్‌ రెండు జట్లు 4-4తో నిలిచాయి. ఈ సమయంలో కెప్టెన్‌ రాణి రాంపాల్ ఒత్తిడిని జయించి ఐదో గోల్‌ సాధించింది. ఆ తర్వాత చైనా విఫలం కావడంతో భారత్‌ 5-4తో విజయం సాధించింది. గ్రూప్‌ దశలోనూ చైనాను టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే.

 ఫైనల్లో చైనాను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా

ఫైనల్లో చైనాను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా

ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. గ్రూప్‌ దశలో వరుస విజయాలతో ముందుకెళ్లిన భారత్... క్వార్టర్‌లో కజకిస్థాన్‌పై గెలిచింది. సెమీ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌పై ఘన విజయం సాధించింది. ఫైనల్లో చైనాను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.

 2004 తర్వాత మళ్లీ ఇప్పుడే

2004 తర్వాత మళ్లీ ఇప్పుడే

తాజా విజయంతో ఈ ఏడాది అటు మహిళలతో పాటు పురుషులు కూడా ఆసియా కప్ గెలిచినట్లు అయింది. 2004 తర్వాత భారత మహిళలు జట్టు ఆసియాకప్‌ గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత గోల్‌ కీపర్‌ సవిత ‘బెస్ట్‌ గోల్‌కీపర్‌'గా ఎంపికైంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:16 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+