Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఘోర అవమానం!

ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లో భాగంగా మంగళవారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన హాకీ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు డబుల్ షాక్ తగిలింది. ఓ వైపు మైదానంలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి చవిచూడగా.. మరోవైపు మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ పెద్ద పొరపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లండన్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌కు ముందు ఉభయ దేశాల జాతీయ గీతాలను ఆలపించే సమయంలో పాకిస్థాన్ జాతీయ జెండాను తప్పుగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్ జాతీయ పతాకంలో ముదురు ఆకుపచ్చ రంగుతో పాటు ఎడమ వైపున నిలువగా ఉండే తెల్లటి పట్టీ ఉంటుంది. ఆకుపచ్చ భాగంలో తెల్లటి అర్ధచంద్రుడు, ఐదు కోణాల నక్షత్రం ఉంటాయి. అయితే భారత్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వాహకులు ప్రదర్శించిన డిజిటల్ స్క్రీన్ జెండాలో ఆ ఎడమ వైపున ఉండాల్సిన తెల్లటి పట్టి పూర్తిగా మాయమైపోయింది.కేవలం ఆకుపచ్చ రంగు, చంద్రుడు, నక్షత్రం మాత్రమే కనిపించాయి. పాక్ జెండాలో ఆకుపచ్చ రంగు ముస్లిం మెజారిటీని సూచిస్తే.. తెల్లటి పట్టీ అక్కడ నివసించే మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాంటి కీలక భాగాన్ని తొలగించి చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

India vs Pakistan Hockey Match Huge Embarrassment for Pakistan as Wrong Flag Displayed Full Details

ఈ వివాదంపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య స్పందిస్తూ కీలక ప్రకటనను విడుదల చేసింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని.. దీనిపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించింది. భవిష్యత్తుల్లో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ఇక ఆట విషయానికి వస్తే.. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తం 7 గోల్స్ నమోదైన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో చివరకు భారత జట్టు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌పై విజయం సాధించి ముందంజ వేసింది.

Story first published: Wednesday, June 24, 2026, 9:14 [IST]
Other articles published on Jun 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+